US Elections: వివేక్‌ రామస్వామి కీలక నిర్ణయం

Published on Wed, 12/27/2023 - 12:26

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ వచ్చే నెల ప్రారంభం కానుంది. జనవరిలో అయోవా (iowa) రాష్ట్రంలో తొలి బ్యాలెట్‌ జరగనుంది. అయితే అయోవా ఓటింగ్‌కు మరికొద్ది రోజులే మిగిలి ఉండగా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. 

‘ఎన్నికల ప్రచారంలో ఇక నుంచి టీవీ చానళ్లకు ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించాం. అలాగని మొత్తం ప్రకటనల బడ్జెట్‌ను తగ్గించ లేదు. సంప్రదాయ టీవీ కాకుండా వేరే మార్గాల్లో ఓటర్లను రీచ్‌ అవుతాం. టీవీ ప్రకటనలపై ఖర్చు పెడితే పెద్దగా ఉపయోగం ఉండటం లేదు’ అని వివేక్‌ రామస్వామి క్యాంపెయిన్‌ మేనేజర్‌ ట్రిసియా మెక్‌ లాలిన్‌ తెలిపారు. 

అయితే తాను ఇప్పటికే క్యాంపెయినింగ్‌ కోసం 20 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు రామస్వామి స్వయంగా మీడియాకు తెలిపారు. ఇంత ఖర్చు చేసినప్పటికీ అయోవాలో రామస్వామివైపు రిపబ్లికన్లు పెద్దగా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.

అయోవాలో 10 శాతం రిపబ్లికన్ల ఓట్లు కూడా రామస్వామికి వచ్చే పరిస్థితులు లేవని సమాచారం. ఇక దేశవ్యాప్తంగా కూడా రామస్వామి గ్రాఫ్‌ రోజురోజుకు పడిపోతున్నట్లు తెలుస్తోంది. కాగా, రిపబ్లికన్ల తరపున ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్న వారిలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే హాట్‌ ఫేవరెట్‌గా దూసుకెళుతుండడం విశేషం.    

ఇదీచదవండి..భారత్‌లో ఉన్న పౌరులకు ఇజ్రాయెల్‌ అడ్వైజరీ

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)