వియత్నాం విషాదం: హైదరాబాద్‌ చేరుకున్న బాధితులు

Published on Mon, 07/13/2026 - 09:58

న్యూఢిల్లీ: వియత్నాంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయుల మృతదేహాలు సోమవారం స్వదేశానికి చేరనున్నాయి. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు పర్యాటకులు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (శంషాబాద్) చేరుకున్నారు.  కాగా హోచి మిన్ సిటీ నుంచి వియత్నాం ఎయిర్‌లైన్స్ (VN979) విమానంలో 15 మంది భారతీయుల మృతదేహాలను ముంబయికి తరలిస్తున్నట్లు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరే ఈ విమానం.. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:35 గంటలకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుంది. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా వెల్లడించింది.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాయబార కార్యాలయం వారికి అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. ముంబయి చేరుకున్న తర్వాత మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు వీలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించామని, బాధిత కుటుంబాలతో సమన్వయం చేసుకోవాలని కోరినట్లు పేర్కొంది. మృతుల్లో 10 మంది తమిళనాడుకు చెందినవారు కాగా.. ముగ్గురు ఆంధ్రప్రదేశ్, ఇద్దరు కేరళ వాసులు ఉన్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.

వియత్నాం పత్రిక 'విఎన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఫు క్వాక్ ద్వీపకల్పం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ‘ఓషన్ పెర్ల్ ఐలాండ్’ సంస్థకు చెందిన ఓ స్పీడ్‌బోట్ 36 మంది ప్రయాణికులతో ‘హాన్ మే రట్’ దీవి నుంచి ‘అన్ థోయ్’ రేవుకు వెళ్తుండగా ఒక్కసారిగా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)