Breaking News

భారతీయ అమెరికన్లలో హారిస్‌కు తగ్గిన ఆదరణ!

Published on Tue, 10/29/2024 - 04:55

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న వేళ డెమొక్రాట్లకు చేదు కబురు. ఆ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్‌ అమెరికన్‌ ఓటర్ల సంఖ్యలో గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా ఏడు శాతం తగ్గుదల నమోదైంది! భారత మూలాలున్న కమలా హారిస్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య 61 శాతానికి తగ్గింది. అంతేగాక తాము డెమొక్రాట్లమని చెప్పుకున్న ఇండియన్‌ అమెరికన్ల సంఖ్య కూడా 56 నుంచి 47 శాతానికి తగ్గింది. సోమవారం వెలువడ్డ ‘ఇండియన్‌ అమెరికన్‌ ఆటిట్యూడ్స్‌’ సర్వేలో ఈ మేరకు తేలింది. ట్రంప్‌కు ఓటేస్తామని వారిలో 32 శాతం మంది పేర్కొన్నారు. 2020లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌కు 68 శాతం మద్దతు దక్కగా ట్రంప్‌కు 22 శాతం మాత్రమే జైకొట్టారు!

→ ఇండియన్‌ అమెరికన్‌ మహిళా ఓటర్లలో 67 శాతం మంది హారిస్‌కు జైకొట్టారు. ట్రంప్‌కు మద్దతిచ్చిన వారు కేవలం 22 శాతమే.
→ 40 ఏళ్ల పైచిలుకు వయసు వారిలో ఏకంగా 70 శాతం మహిళలు, 60 శాతం పురుషులు హారిస్‌కు జైకొట్టారు.
→ 40 ఏళ్ల లోపువారిలో మాత్రం 60 శాతం మహిళలే హారిస్‌కు మద్దతిచ్చారు.
→ ఇండియన్‌ అమెరికన్‌ పురుషుల్లో 53 శాతం హారిస్‌కు, 39 శాతం మంది ట్రంప్‌కు ఓటేస్తామని చెప్పారు.
→ 40 ఏళ్లలోపు పురుషుల్లో మాత్రం ట్రంప్‌దే పైచేయి కావడం విశేషం. ఆయనకు 48 శాతం, హారిస్‌కు 44 శాతం జైకొట్టారు.
→ యువ ఇండియన్‌ అమెరికన్లలో మాత్రం ట్రంప్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు సర్వే తేల్చింది.
→ అమెరికాలో 52 లక్షలకు పైగా భారత సంతతి వారున్నారు. వారిలో ఓటర్ల సంఖ్య 26 లక్షల పై చిలుకు.
→ హిందూయేతరులతో పోలిస్తే హిందువుల్లో ట్రంప్‌ మద్దతుదారులు అధికంగా ఉండటం విశేషం. ఆయనకు ఓటేస్తామని 58 శాతం మంది హిందువులు తెలిపారు. 35 శాతం హిందువులు హారిస్‌కు మద్దతిస్తామన్నారు.
→ హిందూయేతర భారతీయ అమెరికన్లలో 62 శాతం హారిస్‌కు, 27 శాతం ట్రంప్‌కు మద్దతిచ్చారు.
→ 17 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని ప్రధాన సమస్యగా పేర్కొన్నారు.
→ ఉపాధి, ఆర్థిక అవ్యస్థ, అబార్షన్‌ ప్రధానాంశాలని 13 శాతం చెప్పారు.
→ భారత్‌–అమెరికా సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పిన వారు కేవలం 4 శాతమే. 
 

Videos

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు