Breaking News

USA Presidential Elections 2024: కమలా హారిస్‌కు గాయని బియాన్స్‌ మద్దతు

Published on Sun, 10/27/2024 - 06:36

హూస్టన్‌:  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యరి్థగా పోటీకి దిగుతున్న కమలా హారిస్‌కు ప్రఖ్యాత గాయని బియాన్స్‌ మద్దతు ప్రకటించారు. శుక్రవారం రాత్రి హూస్టన్‌లో జరిగిన డెమొక్రటిక్‌ ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ‘‘ఒక సెలబ్రిటీకి ఇక్కడికి రాలేదు. ఒక రాజకీయ నాయకురాలిగా రాలేదు. ఒక తల్లిగా వచ్చాను. మన బిడ్డలు ప్రతిబంధకాలు, పరిమితులు లేకుండా పెరగాలంటే కమలా హారిస్‌కు ఓటు వేయాలి’’అని పిలుపునిచ్చారు. 

హూస్టన్‌ బియాన్స్‌ సొంత నగరం కావడం విశేషం. 2016లోనూ ఆమె అప్పటి డెమొక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతు పలికారు. క్లీవ్‌లాండ్‌లో ప్రచార సభలో హిల్లరీకి మద్దుతుగా ఒక పాట కూడా పాడారు. ఈసారి మాత్రం పాడలేదు. కమలా హారిస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. హూస్టన్‌ సభలో కమలా హారిస్‌ మాట్లాడుతూ.. తన ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. మహిళల పునరుత్పత్తి హక్కుల విషయంలో గత 50 ఏళ్లలో సాధించిన ప్రగతిని ట్రంప్‌ నాశనం చేశారని మండిపడ్డారు. మహిళలకు హక్కులు నిరాకరించారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ను చిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.   

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)