Breaking News

అమెరికాలో కత్తిపోట్లు.. 11 మందికి గాయాలు

Published on Sun, 07/27/2025 - 09:45

ట్రావెర్స్‌ సిటీ: అమెరికాలోని మిషిగన్‌ రాష్ట్రం ట్రావెర్స్‌ సిటీలో శనివారం చోటుచేసుకున్న కత్తిపోట్ల ఘటనలో 11 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులందరినీ మున్సన్‌ హెల్త్‌కేర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

 వాల్‌మార్ట్‌ స్టోర్‌ వద్దకు వచ్చిన వారిపైకి అతడు ఫోల్డబుల్‌ చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఆయుధం సహా అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు మిషిగన్‌ వాసి అని తెలిపిన పోలీసులు అంతకుమించి వివరాలను వెల్లడించలేదు. ఇలా ఉండగా, అల్బుక్వెర్క్‌లోని న్యూమెక్సికో యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి అనుమానితుడు జాన్‌ ఫుయెంటెస్‌(18)ని శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కాల్పుల్లో 14 ఏళ్ల బాలుడు చనిపోగా మరొకరు గాయపడటం తెల్సిందే. 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)