Breaking News

యెమెన్‌లో హౌతీల స్థావరాలపై అమెరికా దాడులు

Published on Sun, 02/04/2024 - 12:05

వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై అమెరికా కూటమి కన్నెర్ర చేసింది. యెమెన్‌లో డజన్ల కొద్ది హౌతీ స్థావరాలపై అమెరికా, యూకే దాడులు జరిపాయి. దాదాపు 13 ప్రదేశాల్లో 36 స్థావరాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. హౌతీల ఆయుధ సామాగ్రిని లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా కూటమి స్పష్టం చేసింది.

జనవరి 28న జోర్డాన్‌లో ముగ్గురు అమెరికా సైనికులను దుండగులు హత్య చేశారు. దీనికి వ్యతిరేకంగా ఇరాక్, సిరియాలో ఇరాన్-సంబంధిత లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడులు జరిపిన ఒక రోజు తర్వాత యెమెన్‌లో మళ్లీ ఉమ్మడి వైమానిక దాడులు జరిగాయి. "అంతర్జాతీయ వాణిజ్య షిప్పింగ్‌తో పాటు ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలపై హౌతీల నిరంతర దాడులకు ప్రతిస్పందనగా యెమెన్‌లోని 13 ప్రదేశాలలో 36 హుతీ స్థావరాలపై దాడి చేశాం" అని యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ సహా ఇతర దేశాల కూటమి స్పష్టం చేసింది. 

హౌతీల ఆయుధాల నిల్వలపై, క్షిపణి వ్యవస్థలు, లాంచర్లు, వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్‌లతో ఉన్న స్థావరాలపై దాడులు జరిగాయి. ఎర్ర సముద్రంలో నౌకలపై ప్రయోగించడానికి సిద్ధమైన ఆరు హౌతీ యాంటీ షిప్ క్షిపణులపై అమెరికా సంయుక్త దళాలు విడివిడిగా దాడులు చేశాయని సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది.

హమాస్‌పై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా హౌతీలు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకలపై దాడులు చేస్తున్నారు. మొదట ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేస్తామని ప్రకటించిన హౌతీలు.. ఇతర దేశాల నౌకలపై కూడా దాడులు ప్రారంభించాయి. దీంతో అమెరికా సహా 12 దేశాలు ఏకమై ఎర్ర సముద్రంలో హౌతీల దాడులకు అడ్డుకట్టవేస్తున్నాయి. 

ఇదీ చదవండి:  ఇరాక్, సిరియాల్లోని లక్ష్యాలపై అమెరికా దాడులు

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)