Breaking News

స్పైడర్ మ్యాన్ ను పట్టుకొని చితక్కొట్టేశారు.. 

Published on Wed, 07/05/2023 - 15:05

న్యూయార్క్: 15 ఏళ్ల అమెరికా టీనేజర్ స్పైడర్ మ్యాన్ వేషధారణలో పార్కుకు వెళ్తే అక్కడి ఆకతాయి యువత బాలుడిని ఎగతాళి చేసి గాయపరిచారు. పాపం స్పైడర్ మ్యాన్ కు ముక్కు నుండి రక్తం ధారకట్టడంతో నిస్సహాయంగా నిలుచుండిపోయాడు. వారు దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

హడ్సన్ ఫాల్స్ కు చెందిన 15 ఏళ్ల అయిడిన్ పెడోన్ న్యూయార్క్ లోని ఒక పార్కు వారు నిర్వహించిన సూపర్ హీరో థీమ్ లో పాల్గొనేందుకు తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకుని పార్కుకి వెళ్ళాడు. అంతలోనే అక్కడికి వచ్చిన కొంతమంది టీనేజర్లు అయిడిన్ చుట్టూ చేసిరి మొదట ఎగతాళి చేశారు. ఆ గుంపులోని ఒక అమ్మాయి అయిడిన్ ముఖంపై బలంగా కొట్టింది. దాంతో తూలిపడబోయిన అయిడిన్ ఆపుకుని స్పైడర్ మ్యాన్ మాస్క్ తొలగించగా ముక్కు మీద తీవ్ర గాయం కావడంతో రక్తం బొటబొటా కారింది. ఈ సంఘటన జరుగుతుండగా పార్కులో మిగతావారు ఫోన్లో ఈ సన్నివేశాన్ని వీడియో తీస్తూ కనిపించడం విశేషం. 

స్థానిక మీడియా న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అయిడిన్ చికిత్స పొందుతున్నాడని, గో ఫండ్ మి అనే పేజీ ప్రతినిధులు మరోసారి అయిడిన్ ఇలా దెబ్బలు తినకుండా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి చందాలు వసూలు చేయగా ఇప్పటికి 10,000 యూఎస్ డాలర్లు( రూ 8.21 లక్షలు) పోగయ్యాయని అన్నారు.  

ఆరో తరగతి చదువుతున్న అయిడిన్ కు ఆత్మన్యూనతా భావం ఎక్కువని, స్కూల్లో తరచుగా సహచరులు తనని ఆటపట్టిస్తూ ఉండటంతో ఆ భావం నుండి బయటపడేందుకు ఆదివారం తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్నాడని, తీరా అక్కడ ఇలా జరగడం అమానుషమని అన్నారు. చుట్టూ ఉన్నవారు దాడిని ఆపకపోగా వీడియోలు తీస్తూ నవ్వుతుండడం మరింత బాధించిందని తెలిపారు.    
    
అయిడిన్ తల్లి ఫిర్యాదు మేరకు హడ్సన్ ఫాల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దాడి చేసిన టీనేజ్ అమ్మాయిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Roller Coaster: తలకిందులుగా వేలాడుతూ.. 3 గంటలు నరకయాతన..

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)