Breaking News

కూలిన అమెరికా నేవీ హెలికాప్టర్, ఫైటర్ జెట్.. చైనా సముద్రంలో 30 నిమిషాల్లో..

Published on Mon, 10/27/2025 - 10:21

వాషింగ్టన్‌: దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నేవీ హెలికాప్టర్‌, ఫైటర్‌ జెట్‌ కుప్పకూలిపోయాయి. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే రెండు వైమానిక వాహనాలు ప్రమాదానికి గురికావడం చర్చనీయాంశంగా మారింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సిబ్బంది, ఫైటర్ జెట్‌లో ఉన్న ఇద్దరు పైలట్లను సురక్షితంగా కాపాడారు.

వివరాల ప్రకారం.. అక్టోబర్ 26, 2025 సాయంత్రం 2:45 గంటలకు మొదటగా ఎంహెచ్‌-60ఆర్‌ సీహాక్ హెలికాప్టర్ దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయింది. తర్వాత అర గంట వ్యవధిలో అంటే.. 3:15 గంటలకు బోయింగ్‌ ఎఫ్‌-18 సూపర్‌ హార్నెట్‌ ఫైటర్‌ జెట్‌ అదే సముద్రంలో కుప్పకూలిపోయింది. అయితే, ప్రమాదానికి గురైన, నావికా విమానం, హెలీకాప్టర్ రెండూ యూఎస్‌ నిమిట్జ్ షిప్ నుండి ఆపరేట్ చేస్తున్నవి కావడం విశేషం.

అయితే, ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సిబ్బంది, ఫైటర్ జెట్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారు. పైలట్లు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే, సాధారణ కార్యకలాపాల్లో ఉన్నప్పుడే ప్రమాదాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై విచారణ జరుగుతోందని అమెరికా పసిఫిక్ ఫ్లీట్ అధికారులు ప్రకటించారు. అయితే, ప్రమాదాలకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)