Breaking News

అమెరికాలో కూలిన యుద్ధ విమానం

Published on Thu, 07/31/2025 - 11:14

కాలిఫోర్నియా: అమెరికాలో నేవీ యుద్ధ వి మానం ఎఫ్‌–35సీ కూలిపోయింది. సెంట్రల్‌ కాలిఫోర్నియాలోని లెమూర్‌లో ఉన్న నేవీ ఎ యిర్‌ స్టేషన్‌ సమీపంలో అమెరికా కాలమా నం ప్రకారం బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ ఘటన జరిగింది. అయితే.. శిక్షణలో ఉన్నప్పుడు జరిగిన ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడు. విమానంలో అదనపు సిబ్బంది ఎవరూ లేరు. 

రెస్యూ్క టీమ్‌ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టింది. అయితే.. జెట్‌ కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. జెట్‌ కూలిపోయిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విమానం క్రాష్‌ కాగానే జెట్‌ శిథిలాల నుంచి భారీగా మంటలు ఎగసిపడు తున్నాయి. ఆ ప్రాంతమతా నల్లటి పొగ దట్టంగా అలుముకుంది. ఏ మేరకు  నష్టం సంభవించింది? బేస్‌ కార్యకలాపాలపై ప్రభావం పడిందా? అనే విషయాలను నేవీ వెల్లడించలేదు. 
 

నావల్‌ ఎయిర్‌ స్టేషన్‌ లెమూర్, సెంట్రల్‌ కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరానికి 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టెల్త్‌ ఫైటర్‌ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన వాటిలో ఒకటి. దీని ధర దాదాపు 115 మిలియన్లు డాలర్లు ఉంటుంది. అమెరికా రక్షణ దిగ్గజం లాక్‌హీడ్‌ మార్టిన్‌ అభివృద్ధి చేసింది. ఇది మల్టీరోల్‌ యుద్ధ విమానం. ఇది వైమానిక ఆధిపత్యం, గ్రౌండ్‌ అటాక్, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌తో సహా విస్తృత శ్రేణి మిషన్ల ప్రయోగం కోసం రూపొందించారు. ఈ విమానం అధునాతన స్టెల్త్‌ టెక్నాలజీ, సెన్సార్లు, అత్యాధునిక ఏవియానిక్స్‌ను కలిగి ఉంది. ఇటీవల, వాతావరణం అనుకూలించక, తక్కువ ఇంధనం కారణంగా బ్రిటిష్‌ రాయల్‌ నేవీ ఎఫ్‌35బీ వేరియంట్‌ కేరళలో నెలరోజులపైగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)