Breaking News

గాజాపై ఇజ్రాయెల్‌ ఆధిపత్యం.. జో బైడెన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Published on Mon, 10/16/2023 - 12:14

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కారణంగా వేల సంఖ్యలో పౌరులు, మిలిటెంట్ల మృత్యువాతపడ్డారు. ఇక, హమాస్‌ దాడులను ఇజ్రాయెల్‌ గట్టిగా తిప్పికొట్టింది. ఇజ్రాయెల్‌ ప్రతిదాడితో గాజా వణికిపోతోంది. ఇప్పటికే పలువురు గాజాను ఇజ్రాయెల్‌ దళాలు చుట్టుముట్టాయి. హమాస్‌ మిలిటెంట్లను కూడా ఇజ్రాయెల్‌ బంధించింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇక, తాజాగా ఓ కార్యక్రమంలో బైడెన్‌ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌ బలగాలు సుదీర్ఘకాలం గాజాలో ఉండటం పెద్ద పొరబాటుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. యుద్ధాల్లో పాటించాల్సిన నిబంధనలను ఇజ్రాయెల్‌ అమలు చేస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. అమాయక పౌరులకు నీరు, ఆహారం, ఔషధాలు అందేట్లు చూడాలని సూచించారు. గాజాను ఇజ్రాయెల్‌ తన ఆధీనంలో ఎక్కవ కాలం ఉంచుకొంటుందని తాను భావించడంలేదన్నారు. అంతకంటే పాలస్తీనీయుల ఆధ్వర్యంలోనే అక్కడి పాలన నిర్వహించాలన్నారు. ఒక వేళ సుదర్ఘీకాలం గాజాలోనే ఇజ్రాయెల్‌ దళాలు ఉంటే అది పెద్ద పొరబాటుగా మారుతుందన్నారు. ప్రస్తుతం గాజా పరిస్థితి చూడండి.. హమాస్‌ శక్తులు మొత్తం పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించవు అని తెలిపారు. 


ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌లో జో బైడెన్‌ పర్యటిస్తారన్న వార్తలపై వైట్‌ హౌస్ స్పందించింది. ఈ సందర్బంగా వైట్‌ హౌస్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధి మాట్లాడుతూ ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని స్పష్టం చేశారు. ఆ దిశగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఆదివారం కూడా జోబైడెన్‌ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడారు. హమాస్‌ దాడుల తర్వాత ఆయన ఇజ్రాయెల్‌ ప్రధానితో మాట్లాడటం ఇది ఐదోసారి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)