Breaking News

సనాతన దినోత్సవంగా సెప్టెంబర్ 3

Published on Wed, 09/06/2023 - 12:32

న్యూయార్క్‌: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ నేత ప్రియాంక ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంలో పెద్ద  ఎత్తున రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్‌లో సనాతన ధర్మంపై ఇలాంటి వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికాలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని కెంటకీలోని లూయిస్‌విల్లే నగర మేయర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు. 

లూయిస్‌విల్లేలోని హిందూ దేవాలయంలో జరిగిన మహా కుంభాభిషేకం వేడుకలో డిప్యూటీ మేయర్ బార్బరా సెక్స్టన్ స్మిత్ అధికారిక ప్రకటనను అందరికి చదివి వినిపించారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 3న సనాతన ధర్మం రోజుగా జరుపుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు చిదానంద సరస్వతి, పరమార్థ నికేతన్‌ అధ్యక్షుడు రిషికేశ్‌, శ్రీశ్రీ రవిశంకర్‌, భగవతీ సరస్వతి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జాక్వెలిన్‌ కోల్‌మన్‌, డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కైషా డోర్సీ, పలువురు ఆధ్యాత్మిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు..

సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. 

ఇదీ చదవండి: మరో వివాదం: ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్‌' వంతు


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)