Breaking News

ఒక్క యాడ్‌తో సెలబ్రిటీగా మారింది.. ఏం జరిగిందో ఏమో భావోద్వేగ పోస్టు పెట్టి మృతి!

Published on Fri, 03/24/2023 - 16:09

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య ప్రకటనలో కనిపించి సెలబ్రిటీగా మారిన ట్రాన్స్‌జెండర్ ఫ్లైట్ అటెండెంట్ కైలీ స్కాట్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టి ప్రాణాలు తీసుకున్నారు. ఆమె కొలరాడోలోని తన ఇంటిలో గత సోమవారం చనిపోయింది. స్కాట్ మరణించడానికి ముందు తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పోస్ట్‌లలో..  తన స్నేహితులు, కుటుంబ సభ్యులను ఉద్దేశించి భావోద్వేగ పోస్ట చేసింది. ‘మనం పంచుకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకోవాలని’ కోరింది.


‘నేను నా చివరి శ్వాసను తీసుకుంటూ, ఈ భూమి నుండి నిష్క్రమిస్తున్నాను. నేను నిరాశపరిచిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను’ అని స్కాట్ పేర్కొంది. ‘మీతో ఉండలేకపోయాను, క్షమించండి, నేను ఇష్టపడే వారికి తోడుగా ఉండలేకపోతున్నాను, మిమ్మల్ని వదలి వెళ్ళడం లేదని దయచేసి అర్థం చేసుకోండంటూ’ తన ఆవేదనను పోస్ట్‌ రూపంలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌లో స్కాట్ తన ప్రియమైన వారిలో కొందరి పేర్లను కూడా పేర్కొంది.


స్కాట్ తల్లి, ఆండ్రియా సిల్వెస్ట్రో, లేఖను పోస్ట్ చేసిన తర్వాత తన కుమార్తె మరణించినట్లు ధృవీకరించింది. ఫేస్‌బుక్ పోస్ట్‌లో.. సిల్వెస్ట్రో ఇలా వ్రాశారు.. "కైలీ స్కాట్... నువ్వు నా కుమార్తెగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నీ నవ్వు చాలా అందంగా ఉండేది. నీ హృదయం మాలో ఎవరికీ అర్థం కానంత పెద్దది” అని తెలిపారు. కాగా, స్కాట్‌ మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)