Breaking News

ఉక్రెయిన్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రాజీనామా 

Published on Sat, 11/29/2025 - 06:20

కీవ్‌: రష్యా దురాక్రమణను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీకి రాజకీయపరంగా గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఆయన సన్నిహితుడు, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్న ఆండ్రీ యెర్మాక్‌(54) పదవికి రాజీనామా చేశారు. అవినీతి వ్యతిరేక విభాగం అధికారులు శుక్రవారం రాజధాని కీవ్‌లోని ఆయన నివాసంతోపాటు ఆఫీసులో సోదాలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఆండ్రీ రాజీనామా చేసినట్లు జెలెన్‌స్కీ ప్రకటించారు. 

తప్పు చేసినట్లు ప్రత్యేకంగా ఎలాంటి అభియోగాలు లేనప్పటికీ, రాజీనామా చేయాలన్న ఒత్తిళ్లు ఇటీవల ఆండ్రీపై పెరిగాయి. రష్యా దండయాత్రకు ముగింపు పలికేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో త్వరలో జరగాల్సిన చర్చల బాధ్యతను జెలెన్‌స్కీ ఈయనకే అప్పగించారు. అయితే, ఎలాంటి వదంతులు, ఊహాగానాలు రాకూడదనేదే తన లక్ష్యమని జెలెన్‌స్కీ చెప్పారు. ఆండ్రీ స్థానంలో ఎవరికి బాధ్యతలు అప్పగించేదీ సంప్రదింపుల అనంతరం అతిత్వరలో ప్రకటిస్తానన్నారు. 

ఒక దేశ భక్తుడిగా ఉక్రెయిన్‌ను ధీటైన స్థానంలో నిలబెట్టినందుకు ఆయన ఆండ్రీకి ధన్యావాదాలు తెలిపారు. ఆండ్రీ యెర్మాక్‌ కూడా అధికారుల సోదాలపై స్పందించారు. ‘దర్యాప్తు బృందానికి ఎటువంటి అభ్యంతరాలు తెలపలేదు. వారితో పూర్తిగా సహకరిస్తున్నా. నా లాయర్లు కూడా నాతో ఉన్నారు’అని టెలిగ్రామ్‌లో పేర్కొన్నారు. ఇంధన రంగంలో రూ.835 కోట్లఅవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో జెలెనెస్కీ మాజీ వ్యాపార భాగస్వామి తిముర్‌ మిండిచ్‌ కీలకంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)