Breaking News

రష్యాలోకి ఉక్రెయిన్‌ సేన.. ఇరుపక్షాల భీకర యుద్ధం

Published on Thu, 08/08/2024 - 07:22

రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొన్నేళ్లుగా యుద్ధం  నడుస్తోంది. అయితే ఇప్పుడు తొలిసారిగా ఉక్రేనియన్ సైన్యం రష్యాలోకి ప్రవేశించింది. దీంతో రష్యా అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్‌లో కలకలం చెలరేగింది. గత 36 గంటలుగా సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల సైన్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది.

దేశంలోని నైరుతి కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ చొరబాటును  కవ్వింపు చర్యగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు. సరిహద్దుల్లో జరుగుతున్న దాడులపై రష్యా స్పందిస్తోందని క్రెమ్లిన్ అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఉక్రెయిన్ అధికారులు మౌనంగా ఉన్నారు. ఈ చొరబాటు తర్వాత ఉక్రెయిన్ సైన్యం వివిధ ఆయుధాలతో రష్యన్ పౌర భవనాలు, నివాస భవనాలు, అంబులెన్స్‌లపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ విషయాన్ని పుతిన్ స్వయంగా తెలిపారు.

ఉక్రెయిన్ దాడి నేపధ్యంలో పుతిన్ అత్యున్నత రక్షణ, భద్రతా అధికారులతో సమావేశమయ్యారు. ఈ విషయంలో తగిన సమాధానం ఇవ్వాలని ఉక్రెయిన్ సైన్యాన్ని కోరారు. కుర్స్క్ ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రివర్గాన్ని ఆదేశించారు. మాస్కోకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఈ యుద్ధం జరుగుతోంది.

రష్యా ఆర్మీ చీఫ్ వాలెరీ గెరాసిమోవ్‌తో పుతిన్‌ కీలక సమావేశం నిర్వహించారు. ఈ యుద్ధంలో సుమారు 100 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందారని,200 మందికి పైగా గాయపడ్డారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. దీనికిముందు కుర్స్క్ తాత్కాలిక గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ మాట్లాడుతూ యుద్ధంలో గాయపడినవారి కోసం స్థానికులు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. తమ భూభాగంలోకి చొరబడి గత 36 గంటలుగా  దాడులకు తెగబడుతున్న ఉక్రేనియన్‌ సైన్యాన్ని రష్యా ఆర్మీ ధైర్యంగా తిప్పికొడుతున్నదన్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)