Breaking News

మెక్‌డోనాల్డ్స్‌ హ్యాపీ మీల్‌ ఆర్డర్ చేస్తున్నారా ? ఈ మహిళ షాకింగ్‌ అనుభవం తెలిస్తే..!

Published on Wed, 10/25/2023 - 12:58

UK Woman Finds Cigarette Butt In Child  Happy Meal At McDonald: ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డోనాల్డ్స్‌లో  యూకేకు చెందిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది.   తన ఇద్దరు చిన్నారుల కోసం మెక్‌డొనాల్డ్స్‌లో హ్యాపీ మీల్‌ను ఆర్డర్‌ చేసింది. బిడ్డల ఆకలి తీర్చాలన్న ఆమె ఆరాటం కాస్తా ప్యాకెట్‌ విప్పిన చూసాక ఆవిరైపోయింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.

గెమ్మా కిర్క్-బోనర్ ఇంగ్లాండ్‌లోని బారో-ఇన్-ఫర్నెస్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ నుండి  పిల్లల హ్యాపీ మీల్‌ను కొనుగోలు చేసింది. రెండు ఫిష్ ఫింగర్ హ్యాపీ మీల్స్‌ను ఇంటికి తీసుకెళ్లింది. ఒక ప్యాకెట్‌ విప్పి పెద్దకుమారుడు  జాక్సన్‌(3)కి ఇచ్చింది. మరో మీల్‌ ఓపెన్‌ చేసిన ఏడాది వయస్సున్న చిన్న కుమారుడు  కాలేబ్‌కు  తినిపించాలని ప్రయత్నిస్తుండగా అందులో కాల్చి పారేసిన సిగరెట్ పీక, బూడిదను గమనించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చిన్న పిల్లాడికి తీనిపిస్తూ తాను చూశాను గనుక సరిపోయింది.. అదే పెద్దవాడు చూడకుండా తినేసి  ఉంటే  అన్న ఆలోచనే ఆమెలో  అసహ్యాన్ని,  ఆందోళననూ రేపింది.

మరొకరికి తనలాంటి అనుభవం ఎదురు కాకూడదంటూ ఈ విషయాన్ని ఫోటోతో సహా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. సిగరెట్‌ పీక, బూడిదతో  ఇపుడు అదనపు రుచి అంటూ  తన ఆగ్రహాన్ని  వ్యక్తం  చేసింది. అంతేకాదు దీనిపై ఫిర్యాదు  చేయబోగా డాల్టన్ రోడ్‌లోని మెక్‌డొనాల్డ్స్ బ్రాంచ్‌ మేనేజర్  కటువుగా మాట్లాడి ఫోన్‌ పెట్టేశాడని కూడా పేర్కొంది. ఈ వ్యవహారంలో తనకు  న్యాయం కావాలని, కంపెనీ క్షమాపణ చెప్పాలని కోరుతోంది.  దీనిపై స్పందించిన ఫ్రాంచైజీ కస్టమర్ల  సంతృప్తి, ఆహార భద్రతే తమకు తొలి ప్రాధాన్యమని వెల్లడించింది. ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు  తీసుకుంటామని తెలిపింది. 


 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)