Breaking News

తప్పయి పోయింది క్షమించండి..  బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్

Published on Thu, 07/20/2023 - 08:44

లండన్: ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్ బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ సైన్యానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన స్వలింగసంపర్కులైన సైనికులకు బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పారు. సైన్యంలోకి వారిని తీసుకోకుండా నిషేధించడం బ్రిటీష్ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యమని అన్నారు.    

దయచేసి క్షమించండి.. 
రిషి సునాక్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. 2000 సంవత్సరానికి ముందు వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా స్వలింగ సంపర్కులైన సైనికులపై బ్రిటీష్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానుషం. స్వలింగ సంపర్కులను సైన్యం నుండి నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి జీవితాల పైనా వారి కుటుంబాలపైనా ఎంతటి తీవ్ర ప్రభావం చూపిందో మేము అర్ధం చేసుకున్నాము. 

ఆరోజున వివక్షకు గురైన ఆనాటి వీరులందరికీ బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నాను. మీరు కూడా మిగతా సైన్యంలాగే  దేశం కోసం చేసిన త్యాగాలను, క్లిష్ట సమయాల్లో చూపిన ఆపార ధైర్య సాహాసాలను తలచుకుని గర్వపడాలన్నారు. ఆయన ఈ ప్రకటన చేయగానే సభ్యులంతా హర్షాతిరేకాలు తెలిపారు.    

యూకే డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ మాట్లాడుతూ.. 1967-2000 మధ్యలో అనుభవజ్ఞులైన ఎందరో స్వలింగసంపర్కులైన సైనికులు చాలా వివక్షకు గురయ్యారు. సైన్యంలోకి వారిని నిషేధించడంతో వారి జీవితాలు ఛిద్రమయ్యాయి. బ్రిటీష్ సాయుధ దళాల చరిత్రలోనే అదొక అవమానకరమైన సహించరాని పొరపాటని అన్నారు. 

ఇది కూడా చదవండి: ప్రపంచ కప్ టోర్నమెంటుకు ముందు కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)