Breaking News

యూకేలో పాస్‌పోర్ట్‌ సిబ్బంది సమ్మె

Published on Tue, 04/04/2023 - 06:14

లండన్‌: దేశంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు ఎగబాకిందని, ధరలు పెరిగిపోతున్నాయని, తమ వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో పాస్‌పోర్ట్‌ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది సోమవారం సమ్మె ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ సమ్మె కొనసాగనుంది. దీంతో విదేశాలకు వెళ్లాల్సినవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

పాస్‌పోర్ట్‌లు సకాలంలో అందకపోతే ప్రయాణాలు మానుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. యూకేలో ద్రవ్యోల్బణం 10.4 శాతానికి చేరుకుంది. ఆహారం, ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది.  తక్షణమే వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో వైద్యులు, ఉపాధ్యాయులు, రైళ్లు, బస్సుల డ్రైవర్లు, ఎయిర్‌పోర్టుల్లో పనిచేసి సిబ్బంది, పోస్టల్‌ సిబ్బంది ఇదివరకే సమ్మెకు దిగారు.  

మళ్లీ టీచర్ల సమ్మెబాట  
యూకే ప్రభుత్వం ఆఫర్‌ చేసిన వేతన 4.5 శాతం పెంపు, 1,000 పౌండ్ల వన్‌టైమ్‌ చెల్లింపును టీచర్లు తిరస్కరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 27, మే 2న సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు నేషనల్‌ ఎడ్యుకేషన్‌ యూనియన్‌ ప్రకటించింది.    

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)