Breaking News

కిరాతక నర్సు లూసీకి జీవిత ఖైదు..? 

Published on Mon, 08/21/2023 - 09:37

లండన్: వాయువ్య ఇంగ్లాండ్లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్లో నియోనైటల్ విభాగంలో పనిచేస్తున్న లూసీ లెట్బీ(35)కి ఏడుగురు పసి పిల్లలను చంపిన నేరంలో జీవితకల జైలుశిక్షపడింది. 

కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్, నియోనైటల్ విభాగంలో జూన్ 2015 నుండి జోన్ 2016 వ్యవధిలో పసిపిల్లలను చంపిన కేసులో లూసీ లెట్బీని అరెస్టు చేసారు బ్రిటీష్ పోలీసులు. బ్రిటీష్ మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో ఈ కేసుపై వాదనలు పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్ వారు తెలిపిన వివరాల ప్రకారం లూసీ నర్సుగా పనిచేస్తున్న సమయంలో ఏడుగురు పిల్లలను చంపగా మరో ఆరుగురిపై హత్యాయత్నానికి పాల్పడింది. 

పసిపిల్లల శరీరంలోకి ఇంజక్షన్ ద్వారా గాలిని పంపించడం, ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం, పాలు ఎక్కువగా పట్టించడం ద్వారా ఈ హత్యలకు పాల్పడినట్లు తెలిపింది. ఈ కేసుపై మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో సుమారు 110 గంటలు వాదనలు జరగగా సోమవారం ఈ కేసులో తీర్పు వెలువడనుంది. నేరం తీవ్రత పెద్దది కాబట్టి ఆమెకు జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముందంటున్నాయి కోర్టు వర్గాలు. 

లూసీకి జీవితఖైదు పడే అవకాశముందని బాధిత కుటుంబాలకు తెలిసిన తర్వాత వారిలో కొందరు సంతృప్తిని వ్యక్తం చేయగా మరికొంతమంది ఆమెకు ఇంకా పెద్ద శిక్ష పడాలని ఈ శిక్ష సరిపోదని అన్నారు. శుక్రవారం నాడు చివరి రోజు వాదనలు జరిగిన సమయంలో లూసీ కన్నీటి పర్యంతమై సానుభూతి పొందే ప్రత్యత్నం చేసినా కూడా ఆమెను ఎవ్వరూ కనికరించలేదు. 

ఇది కూడా చదవండి: డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)