Breaking News

వియత్నాంను వణికించిన బ్వాలోయి

Published on Tue, 09/30/2025 - 05:16

హనోయి: భారీ వర్షం, భీకరగాలులతో కూడిన బ్వాలోయి తుఫాను వియత్నాంలో విలయం సృష్టించింది. తుఫాన్‌ తీవ్రతకు పలు ప్రావిన్సుల్లో రోడ్లు జలమయం కాగా, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. గంటకు 133 కిలోమీటర్ల వేగంగా గాలులు తీయడంతో విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివిధ ఘటనల్లో కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

జాడ తెలికుండా పోయిన 17 మంది జాలర్ల కోసం గాలింపు చేపట్టినట్లు యంత్రాంగం తెలిపింది. సోమవారం ఉదయం 10 గంటలకు తుఫాన్‌ బలహీనపడి లావోస్‌ దిశగా వెళ్లిందని అధికారులు తెలిపారు. గాలుల తీవ్రతకు ఇళ్లు కూలిన ఘటనల్లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నిన్హ్‌ బిన్హ్‌ ప్రావిన్స్‌లోనే ఆరుగురు చనిపోయారని చెప్పారు. థన్హ్‌ హొవా, హూయి, దనంగ్‌ ప్రావిన్స్‌ల్లో జరిగిన ఘటనల్లో మరో ముగ్గురు మృతి చెందారు. క్వాంగ్‌ ట్రి ప్రావిన్స్‌లో గాలుల తీవ్రతకు లంగరేసిన చేపల పడవ తాళ్లు తెగడంతో అది సముద్ర జలాల్లోకి కొట్టుకు పోయింది.

దాని కింద ఆశ్రయం తీసుకుంటున్న 9 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. జియా లాయ్‌ ప్రావిన్స్‌లో చేపల వేటకు వెళ్లిన 8 మంది జాడ తెలియడం లేదని అధికారులు తెలిపారు. తుఫాన్‌ కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఆదివారం రాత్రి 3.47 లక్షల నివాసితులు అంధకారంలో గడిపారని అధికారులు తెలిపారు. బ్వాలోయి కారణంగా ఫిలిప్పీన్స్‌లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

#

Tags : 1

Videos

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)