Breaking News

వీడియో: గాల్లో రెండు విమానాలు ఢీ.. పైలట్‌ మృతి

Published on Mon, 06/03/2024 - 11:22

లిస్బన్‌: పోర్చుగల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ పోర్చుగల్‌లో జరుగుతున్న ఎయిర్‌షో కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. గాల్లోనే రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొన్న కారణంగా పైలట్‌ మృతిచెందాడు.

వివరాల ప్రకారం.. దక్షిణ పోర్చుగల్‌లోని బెజాలో ఎయిర్‌షో జరుగుతోంది. ఈ ఎయిర్‌ షో కార్యక్రమంలో మొత్తం ఆరు విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. కాగా, ఆదివారం ఎయిర్‌షో సందర్భంగా ఒక విమానం వేగంగా పైకి దూసుకెళ్లి మరోదాన్ని ఢీకొట్టింది. దీంతో రెండూ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒకటి ఎయిర్‌బేస్‌కు అవతల పడిపోగా మరొకటి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో  స్పెయిన్‌కు చెందిన పైలట్‌ మృతిచెందాడు. మరో పైలట్‌(పోర్చుగల్‌)కు తీవ్ర గాయాలయ్యాయి.  

ఇక, పోర్చుగల్‌, స్పెయిన్‌కు చెందిన పైలట్లతో కూడిన ‘యాక్‌ స్టార్స్’ అనే ఏరోబాటిక్‌ గ్రూప్‌ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది. వీటిలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లెవ్ యాక్-52 రకానికి చెందినవి. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో గుర్తిస్తామని పోర్చుగల్‌ రక్షణమంత్రి నునో మెలో తెలిపారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)