Breaking News

4,500 ఏళ్ల నాటి ఆభరణం

Published on Mon, 09/29/2025 - 05:45

ఇస్తాంబుల్‌: తుర్కియే(టర్కీ)లో వేలాది సంవత్సరాల క్రితం నాటి అరుదైన బంగారు ఆభరణం, విలువైన పచ్చరాయి(జేడ్‌) తవ్వకాల్లో బయటపడ్డాయి. ప్రాచీన నగరం ‘ట్రోయ్‌’లో పురావస్తు పరిశోధకులు తవ్వకాలు సాగిస్తుండగా, ఇవి బహిర్గతమయ్యాయి. గత శతాబ్ద కాలంలో తవ్వకాల్లో వెలుగుచూసిన అత్యంత విలువైన నిధి ఇదేనని అంచనా వేస్తున్నారు. ఈ రెండు వస్తువులు ప్రపంచ పరిశోధకులు దృష్టిని ఆకర్శిస్తున్నాయి. 

‘ట్రోయ్‌’లో గత 160 ఏళ్లుగా తవ్వకాలు జరుగుతుండడం విశేషం. తాజాగా బయటపడిన బంగారు ఆభరణం క్రీస్తుపూర్వం 2,500 ఏళ్ల నాటిదని, కంచు యుగంలో అప్పటి ప్రజలు ఛాతీపై ధరించి ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఒక తీగకు అతికించిన నాలుగు వలయాల ఆకారంలో ఉంది. ఈ ఆభరణం 4,500 ఏళ్ల క్రితం నాటిది కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పట్లో బంగారం వినియోగం అధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ట్రోయ్‌లో జరిగిన తవ్వకాల్లో ఆ ఆభరణంతోపాటు ఒక లోహపు పిన్ను, పచ్చరాయి కూడా బయటపడ్డాయి. 

ఈ రాయి కూడా 4,500 సంవత్సరాల క్రితం నాటిదని గుర్తించినట్లు తుర్కియే పర్యాటక శాఖ మంత్రి మెహ్‌మెట్‌ నూరీ ఎర్సో చెప్పారు. దీన్ని ఆ కాలంలో అత్యంత విలాసవంతమైన వస్తువుగా భావించేవారని, ధనవంతులు ఉంగరంలాగా ధరించేవారని పేర్కొన్నారు. తవ్వకాల్లో దొరికిన విలువైన ఈ నిధిని ట్రోయ్‌ మ్యూజియంలో ప్రదర్శిస్తామని, ప్రజలు తిలకించవచ్చని చెప్పారు. ప్రస్తుత వీటి విలువ తేల్చే పనిలో నిపుణులు నిమగ్నమయ్యారు. ట్రోయ్‌ నగరానికి ఘనమైన చరిత్రే ఉంది. కంచు యుగంలో ఇక్కడ వ్యాపారం బాగా జరిగేది. విదేశాల నుంచి వర్తకులు వచ్చేవారు. విలువైన వస్తువుల క్రయవిక్రయాలు జోరుగా సాగేవి. ట్రోయ్‌ భూగర్భంలో అత్యంత విలువైన నిధి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.    
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)