Breaking News

టర్కీ చెంత ‘మోస్ట్‌ పవర్‌ఫుల్‌’ నాన్‌ న్యూక్లియర్‌ బాంబు

Published on Tue, 07/29/2025 - 20:10

అంకారా: అత్యంత శక్తిమంతమైన నాన్‌ న్యూక్లియర్‌ బాంబును తుర్కియే(టర్కీ) అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని తమ దేశ 17వ ఇంటర్నేషనల్‌ డిపెన్స్‌ ఇండస్ట్రీ ఫెయిర్‌లో భాగంగా ఈరోజు(మంగళవారం, జూలై 29) ప్రకటించింది.  గాజాప్‌(Gazap) అనే 970 కిలోగ్రాముల ఈ బాంబు.. అత్యంత శక్తిమంతమైన నాన్‌ న్యూక్లియర్‌ బాంబుగా పరిగణించబడుతోంది.  

 ఈ బాంబు పరిమాణమే 970 కిలోలు కాగా, దీని విధ్వంస శక్తి 10 వేల ఫ్రాగ్మెంట్లుగా ఉంది. అంటే ఇది సుమారు కిలోమీటర్‌ పరిధిలో విధ్వంసం సృష్టించే అవకాశం ఉంటుంది.  ఈ బాంబు యొక్క ఫ్రాగ్మెంటేషన్ డెన్సిటీ సాధారణ ఎంకే బాంబు కంటే మూడ రెట్లు అధికం.  దీన్ని ఫైటర్‌ జెట్లలో ఉపయోగించే అవకాశం ఉంది. భవిష్యత్‌లో డ్రోన్ల ద్వారా కూడా ప్రయోగించే అవకాశాలున్నాయి. 

హయాలెట్‌ బాంబు సైతం..
మరో అత్యంత శక్తిమంతమైన బంకర్‌ బస్టర్‌ను సైతం తయారుచేసింది టర్కీ. హయాలెట్‌ అనే బంకర్‌ బస్టర్‌ బాంబును అభివృద్ధి చేసింది.  ఇది కఠినమైన లక్ష్యాలను లేదా సైనిక బంకర్‌ల వంటి లోతైన భూగర్భంలో పాతిపెట్టిన లక్ష్యాలను చొచ్చుకుపోయేలా రూపొందించబడింది. హయాలెట్‌ను NEB-1, NEB-2 అని కూడా పిలుస్తారు.  ఉక్కుగోడలా నిర్మాణాలను సైతం విధ్వంసం చేయడానికి తయారుచేసిన బాంబు ఇది. దీన్ని బంకర్‌ బస్టర్‌ బాంబుగా పరిగణిస్తున్నారు.

#

Tags : 1

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)