Breaking News

ఇజ్రాయెల్‌కు హెచ్చరిక.. టర్కీ సంచలన నిర్ణయం!

Published on Mon, 07/29/2024 - 08:42

అంకారా: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌.. గాజాపై r/ఇజ్రాయెల్‌ దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే గాజా ప్రజలకు సాయం చేసేందుకు తాము ఇజ్రాయెల్‌లోకి ప్రవేశిస్తామని ఎర్డోగాన్‌ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌ దాడులను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు.

కాగా, తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎర్డోగాన్‌.. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలస్తీనా ప్రజలకు అండగా టర్కీ అండగా నిలుస్తుందన్నారు. అలాగే, టర్కీ గతంలో లిబియా నాగోర్నో-కరాబాఖ్‌లలో ప్రవేశించినట్టుగా ఇజ్రాయెల్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌లోకి వెళ్తే కనుక వారి సైన్యంపై తీవ్రమైన దాడులు జరుగుతాయి అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఎర్డోగాన్‌ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ ఎలాంటి కామెంట్స్‌ చేయకపోవడం గమనార్హం. కాగా 2020లో ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన లిబియా జాతీయ ఒప్పందానికి మద్దతుగా టర్కీ సైనిక సిబ్బందిని లిబియాకు పంపింది.

ఇదిలా ఉండగా.. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌ బాంబుల మోత మోగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ స్కూల్‌ భవనంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 100 మంది గాయపడ్డారు. సెంట్రల్ గాజాలోని డీర్‌-అల్‌-బలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల, యువత మృతదేహాలకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. వీరి మృతదేహాలను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు వీధుల్లోకి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.

Videos

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)