Breaking News

ఆ చిల్లర విలువ ఎంత అంటే?

Published on Mon, 03/25/2024 - 13:16

ప్రతి ఏటా లక్షలాదిమంది పర్యాటకులు ఇటలీ రాజధాని రోమ్‌ను సందర్శిస్తుంటారు. రోమ్ అందాలను చూసినవారు మళ్లీ ఇక్కడికి రావాలని అనుకుంటారు. రోమ్‌ని  సందర్శించే పర్యాటకులు ట్రెవీ ఫౌంటెన్‌లో ఒక నాణెం లేదా రెండు నాణేలు విసురుతుంటారు. ఈ విధంగా ప్రతి ఏటా సుమారు ఒక మిలియన్ యూరోలు (రూ.9 కోట్లు) ఈ ఫౌంటెన్‌లో జమ అవుతున్నాయట.

ఒక అంచనా ప్రకారం పర్యాటకులు ప్రతిరోజూ సుమారు 3000 యూరో నాణేలను ఈ ఫౌంటెన్‌లోకి విసిరివేస్తున్నారు. అంటే ప్రతిరోజూ రూ. 2,50,000 అంటే సంవత్సరానికి రూ.9 కోట్లు ఈ ఫౌంటెన్‌లోకి విసురుతున్నారన్న మాట. ట్రెవీ ఫౌంటెన్‌లోకి విసిరిన నాణేలను బయటకు తీసి, స్థానిక పేదలు, నిరాశ్రయులైన ప్రజలకు ఆహారం అందించడానికి ఉపయోగిస్తారు. 

ట్రెవీ ఫౌంటెన్ రోమ్‌లోని ట్రెవీ నగరంలో ఉంది. ఈ ఫౌంటెన్ 85 అడుగుల ఎత్తు, 161 అడుగుల వెడల్పు కలిగివుంది. ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన ఫౌంటెన్లలో ఒకటి. దీనికి ఇటాలియన్ ఆర్కిటెక్ట్ నికోలా సాల్వి రూపమిచ్చారు.  పియట్రో బ్రాచి దీనిని నిర్మించారు. దీని నిర్మాణ పనులు 1732లో ప్రారంభమై 1762లో పూర్తయ్యాయి. రోమ్‌కు వచ్చే దాదాపు ప్రతి పర్యాటకుడు ట్రెవీ ఫౌంటెన్‌లో నాణెం విసురుతాడు. రోమ్‌ను మరోమారు సందర్శించాలనుకునే పర్యాటకులు ఈ ఫౌంటెన్‌లో నాణేలు విసురుతారట. 
 

కాగా ఈ పౌంటెన్‌లో నాణేలు విసిరేందుకు ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఫౌంటెన్‌ దగ్గర సినిమా షూటింగ్‌లు, ఫ్యాషన్ షోలు తరచూ నిర్వహిస్తుంటారు. 1954లో విడుదలైన ‘త్రీ కాయిన్స్ ఇన్ ది ఫౌంటెన్’ అనే హాలీవుడ్ చిత్రం ఈ ఫౌంటెన్‌ ఇతివృత్తం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ ఫౌంటెన్ మరింత ఫేమస్‌గా మారింది. . 
 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)