Breaking News

నలుగురిని బలిగొన్న టిక్ టాక్ ఛాలెంజ్.. 

Published on Sun, 07/09/2023 - 19:24

అలబామా: అమెరికాలోని అలబామాలో టిక్ టాక్ వీడియోల పిచ్చి నలుగురు ప్రాణాలను తీసింది. వీరంతా బోట్ జంపింగ్ ఛాలెంజ్ పేరుతో వేగంగా వెళ్తోన్న రన్నింగ్ బోటు లోనుంచి నీటిలోకి దూకే ప్రయత్నంలో మెడలు విరగ్గొట్టుకుని అక్కడికక్కడే చనిపోయారు.  

టిక్ టాక్ వీడియోలంటే చాలా మందికి ఒక సరదా. వీడియోలో ఐడియా వినూత్నంగా ఉండాలే గానీ చాలా తక్కువ వ్యవధిలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకోవచ్చు. అలా పాపులర్ అయినవారు చాలామందే ఉన్నారు. అయితే టిక్ టాక్ వలన కలిగే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్న నెపంతో చాలా దేశాలు ఈ యాప్ ను నిషేధించాయి. 

ఇదిలా ఉండగా అమెరికాలోని అలబామాలో టిక్ టాక్ సరికొత్త ఛాలెంజ్ ఇప్పటికే నలుగురిని బలి తీసుకుంది. అదే బోట్ జంపింగ్ ఛాలెంజ్.. సముద్రంలో వేగంగా వెళ్తున్న బోటు నుండి నీటిలోకి దూకడమే ఈ ఛాలెంజ్. ఈ విచిత్రమైన ఛాలెంజ్ ఉన్నట్టుండి వైరల్ గా మారడంతో అనేకమంది ఈ ప్రయత్నం చేస్తూ బోట్ నుండి దూకుతూ వీడియోలు తీశారు. కానీ వారిలో నలుగురు మాత్రం తమ మెడలను విరగ్గొట్టుకుని విగతజీవులుగా మారిపోయారు. ఈ వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

అమెరికాకు చెందిన కెప్టెన్ జిమ్ డేవిస్ మాట్లాడుతూ గత ఆరు నెలల్లో మనం నియంత్రించగలిగి కూడా అలా చేయకపోవడం వలన ఈ దిక్కుమాలిన ఛాలెంజ్ వలన నలుగురు చనిపోయారని అన్నారు. నీటిలోకి దూకగానే క్షణాల వ్యవధిలో వారి మెడలు విరిగిపోయాయని, వీరంతా స్నేహితుల ముందు షో ఆఫ్ చేయాలన్న తపనతో చనిపోయినవారేనని ఆయన అన్నారు.      

ఇది కూడా చదవండి: ఖలిస్తానీలకు దీటుగా భారతీయుల ర్యాలీ.. 


 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)