నైతిక ఉల్లంఘన: థాయ్‌లాండ్‌ ప్రధాని తొలగింపు

Published on Wed, 08/14/2024 - 15:40

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రిపై వేటు వేస్తూ.. రాజ్యాంగ న్యాయ స్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. నైతిక ఉల్లంఘన కేసులో స్రెత్తా తవిసిన్‌ను ప్రధాన మంత్రి పదవి నుంచి తొలిగించినట్లు వెల్లడించింది. గతంలో జైలు శిక్ష అనుభవించిన న్యాయవాదిని మంత్రివర్గంలో నియమించటంతో థావిసిన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని కోర్టు న్యాయమూర్తి పుణ్య ఉద్చాచోన్ అన్నారు. విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు తవిసిన్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించాలని నిర్ణయించారు. మరోవైపు.. తక్షణమే తమ ఆదేశాలను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన దేశ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పిచిత్ చుయెన్‌బాన్‌ను ప్రధాని కార్యాలయ మంత్రిగా తవిసిన్‌ నియమించారు. అయితే ఆయన 2008లో మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రాకు సంబంధించిన న్యాయమూర్తికి లంచం ఇచ్చిన కేసులో కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొని ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు. ఏప్రిల్‌లో పిచిత్‌ మంత్రిగా నియామకం జరిగిన నెల రోజుల తర్వాత దేశ మిలిటరీ నియమించి 40 మంది మాజీ సెనేటర్ల బృందం నైతిక ఉల్లంఘిన కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని తొలిగించిన అనంతరం కేబినెట్ తక్షణమే రద్దు చేయబడదని, థాయ్‌లాండ్‌ కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు కేర్ టేకర్ ప్రధాని ఉంటారని అధికారులు పేర్కొన్నారు.
 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)