Breaking News

పగలు మద్యం తాగితే భారీ ఫైన్‌.. అమల్లోకి కొత్త చట్టం..ఎక్కడంటే?

Published on Sun, 11/09/2025 - 19:26

బ్యాంకాక్‌: ‘పట్టపగలే మద్యం సేవిస్తున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త! నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగితే రూ.27,500 జరిమానా తప్పదు’అంటూ థాయ్‌లాండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మద్యం వినియోగాన్ని నియంత్రించేందుకు కఠినమైన కొత్త చట్టాలను అమలు చేసింది.

పగటి మద్యం తాగాడాన్ని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొత్త నిబంధనల ప్రకారం, నియమాలను ఉల్లంఘించిన వారికి రూ.27,500 (10,000 బాత్‌) వరకు జరిమానా విధించనున్నారు.

ఉదయం 2 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు మద్యం సేవించడం, విక్రయించడం నిషేదం. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి థాయ్‌లాండ్‌ కరెన్సీలో 10,000 బాత్‌ (రూ.27,500కు పైగా) జరిమానా లేదా 6 నెలల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా మద్యం వినియోగాన్ని నియంత్రించడం ద్వారా సామాజిక సమస్యలు, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయిలాండ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

అయితే,థాయ్‌లాండ్‌ ప్రభుత్వ నిర్ణయంపై పర్యాటకులు పెదవి విరిస్తున్నారు. పర్యాటక రంగంలో మద్యం వినియోగం సాధారణంగా కనిపిస్తుంది. అయితే, ఈ కొత్త చట్టాలు పర్యాటకులపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. అక్కడి ప్రభుత్వం సైంతం పర్యాటకులు ఈ నిబంధనలను పాటించాల్సిందే, లేకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. పోలీసు, మునిసిపల్‌ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రెస్టారెంట్లు, బార్లు, పబ్స్ వంటి ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. సీసీటీవీ ఆధారంగా మద్యం సేవనాన్ని గుర్తించి చర్యలు తీసుకుంటారు.

థాయ్‌లాండ్‌ తీసుకున్న ఈ చర్యలు ఆసియా దేశాల్లో మద్యం నియంత్రణకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయి. వివిధ దేశాల పర్యాటక సంస్థలు తమ కస్టమర్లకు ఈ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ కొత్త చట్టాల అమలుతో థాయ్‌లాండ్‌లో మద్యం వినియోగం నియంత్రణకు గట్టి అడుగు పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు, పర్యాటకులు ఈ నిబంధనలను గౌరవించి, సురక్షితంగా, చట్టబద్ధంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)