Breaking News

థాయ్‌, కంబోడియా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత

Published on Thu, 07/24/2025 - 10:03

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్- కంబోడియా మధ్య సరిహద్దు వివాదాల కారణంగా ఇరు దేశల సంబంధాలు క్షీణిస్తున్నాయి. తాజాగా సరిహద్దుల్లో భద్రతా దళాల ఘర్షణలు జరిగినట్లు  ఇరు దేశాలు మీడియాకు తెలిపాయి. థాయ్ సైన్యం, కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ప్రసాత్ తా ముయెన్ థామ్ సమీపంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. థాయ్‌లాండ్ పరిధిలోని సురిన్ ప్రావిన్స్‌లో ప్రసాత్ తా ముయెన్ ఉంది. అయితే కంబోడియా  ఇది తమదేనని చెబుతోంది.

ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన దరిమిలా థాయ్- కంబోడియా సైనికుల పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. గురువారం ఉదయం పేలుళ్ల శబ్ధాలు వినిపిస్తుండటంతో, తాము  పారిపోయి కాంక్రీట్ బంకర్‌లో దాక్కుంటున్నట్లు థాయ్‌లాండ్ ప్రజలు తెలిపారు. థాయ్‌లాండ్ , కంబోడియాలు ఎవరు తొలుత కాల్పులు జరిపారనే దానిపై వాదనలు చేసుకున్నాయి.  ఈ ఆగ్నేయాసియా పొరుగు దేశాల మధ్య సంబంధాలు మే నెల నుండి క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో చోటుచేసుకున్న సాయుధ ఘర్షణలో కంబోడియా సైనికుడొకరు మృతిచెందారు.

థాయ్‌లాండ్ ముందుగా ఈ సాయుధ ఘర్షణను ప్రారంభించిందని, కంబోడియా స్వయం రక్షణ పరిధిలోనే వ్యవహరించిందని,  అయితే థాయ్ దళాల నిర్ద్వంద్వ చొరబాటుకు ప్రతిస్పందించామని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం సరిహద్దు సమీపంలో జరిగిన ఒక ల్యాండ్ మైన్ పేలుడులో ఐదుగురు థాయ్ సైనికులు గాయపడ్డారు. దీనికి ముందు కూడా ఒక ల్యాండ్ మైన్ పేలి, ముగ్గురు థాయ్ సైనికులు గాయపడ్డారు. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ప్రాంతంపై కంబోడియాకు సార్వభౌమాధికారాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి  ఇరు రెండు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)