Breaking News

థాయ్‌లాండ్‌ మాజీ ప్రధాని షినవత్రాకు ఏడాది జైలు శిక్ష

Published on Wed, 09/10/2025 - 03:39

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ మాజీ ప్రధానమంత్రి థక్సిన్‌ షినవత్రా(Thaksin Shinawatra)కు అధికార దుర్వినియోగం తదితర పాత కేసుల్లో ఏడాది జైలు శిక్ష పడింది. పదేళ్ల అజ్ఞాతం అనంతరం 2023లో ఆయన స్వదేశానికి తిరిగొచ్చాక అధికారులు ఆయన కేసును తప్పుగా అన్వయించుకున్నారా అన్న ఆరోపణలపై దర్యాప్తు జరిపిన కోర్టు ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. థక్సిన్‌కు విధించిన శిక్షను సరిగ్గా అమలు చేయలేదని, పోలీస్‌ ఆస్పత్రిలో ఆయన నిర్బంధంలో ఉన్న కాలాన్ని జైలు శిక్షగా పరిగణించలేమని పేర్కొంది.

2023లో స్వదేశానికి చేరుకున్న షినవత్రా సగం రోజు మాత్రమే జైలులో ఉన్నారు. అనంతరం ఆయన్ను అనారోగ్య కా రణాలతో అన్ని వసతులుండే పోలీస్‌ ఆస్పత్రికి తీసు కెళ్లారు. అయితే, ఆయన అనారోగ్యం అంత తీవ్రమైంది కాదని, జైలు ఆస్పత్రిలోనే చికిత్స చేయవచ్చని తా జాగా సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయస్థానానికి షినవత్ర కుమారుడు పింటొంగ్‌టా, కుమార్తె, మాజీ ప్రధాని పెటొంగ్‌టర్న్‌తో కలిసి వచ్చారు.

అనంతరం ఆయన్ను అధికారులు జైలుకు తీసుకెళ్లారు. 2001లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన థక్సిన్‌ 2006లో సైనిక తిరుగుబాటు జరిగే వరకు పదవిలో కొనసాగారు. అనంతరం విదేశాలకు వెళ్లిపోయారు. అప్పుడే పలు ఆరోపణలువచ్చాయి. 2008లో తిరిగొచ్చినా మళ్లీ వెంటనే దేశం విడిచారు. రాచ కుటుంబాన్ని విమర్శించిన కేసు నుంచి ఆయనకు గత నెలలో విముక్తి కలిగింది. 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)