Breaking News

విమానంలో భయానక అనుభవం ..

Published on Mon, 08/14/2023 - 05:36

వాషింగ్టన్‌: సాంకేతిక లోపం కారణంగా విమానంలో ఒక్కసారిగా తక్కువ ఎత్తుకు దిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పీడన సమస్యను అధిగమించేందుకు విమానాన్ని మూడు నిమిషాల్లోనే 15 వేల అడుగుల మేర దించాల్సి వచ్చినట్లు పిడ్మాంట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఫాక్స్‌ న్యూస్‌కు తెలిపింది. నార్త్‌ కరొలినాలోని చార్లొట్టె నుంచి ఫ్లోరిడాలోని గైన్స్‌విల్లెకు వెళ్తున్న పిడ్మాంట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ నెల 10వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది.

చివరికి గమ్యస్థానానికి చేరుకుని సురక్షితంగా ల్యాండయింది. ‘టేకాఫ్‌ తీసుకున్న 43 నిమిషాల తర్వాత 29 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో సమస్య మొదలైంది. క్యాబిన్‌లో పీడనం అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రయాణికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.  ఆరు నిమిషాల వ్యవధిలోనే మొత్తం 18,600 అడుగులు కిందికి దిగింది’అని ఫ్లైట్‌అవేర్‌ డేటా విడుదల చేసింది.

ఘటనపై హారిసన్‌ హోవ్‌ అనే ప్రయాణికుడు సోషల్‌ మీడియా ఎక్స్‌(ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు. ‘కాలుతున్న వాసన, పెద్ద శబ్దం, చెవుల్లో హోరు’తో గగుర్పాటు కలిగించిందని పేర్కొన్నారు.  కేబిన్‌లో కాలుతున్న వాసన, పెద్ద శబ్దాలు రావడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఊపిరాడక కొందరు ప్రయాణికులు ఆక్సిజన్‌ మాసు్కలతో గాలి పీల్చుకుంటున్న ఫొటోను హారిసన్‌ షేర్‌ చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)