Breaking News

మొజాంబిక్‌లో హింస.. 21 మంది మృతి

Published on Wed, 12/25/2024 - 08:01

మ్యాపుటు:తూర్పు ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌లో హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘనటల్లో21మంది దాకా మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఏడాది అక్టోబర్‌ 9న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రీలిమో పార్టీ అధ్యక్ష అభ్యర్థి డేనియల్‌ చాపో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నిక వివాదాస్పదమైంది. దీనిపై ఓటమి చెందిన అధ్యక్ష అభ్యర్థి వెనాన్సియో సుప్రీంకోర్టుకు వెళ్లారు.

కోర్టు చాపో ఎన్నిక సరైనదేనంటూ తాజాగా తీర్పిచ్చింది. దీంతో వెనాన్సియో మద్దతుదారులు హింసకు పాల్పడ్డారు. మొత్తం 236 హింసాత్మక ఘటనలు జరిగాయి. మృతిచెందిన 21  మందిలో ఇద్దరు పోలీసులున్నారు. ఆందోళనకారులు చాలా వాహనాలకు నిప్పంటించారు. రాజధాని మ్యాపుటులో అల్లరిమూకలు షాపులు దోచుకున్నారు. 

హింసకు భయపడి రాజధాని నగరం నుంచి ప్రభుత్వ అధికారులు పారిపోయినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఆందోళనలతోపాటు దోపిడీలు జరుగుతున్నాయని  మొజాంబిక్‌ తాత్కాలిక మంత్రి పాస్కోల్ రోండా ధృవీకరించారు. కాగా,అధ్యక్ష ఎన్నికల్లో చాపోకు 65 శాతం ఓట్లు రాగా వెనాన్సియోకు 24 శాతం ఓట్లు వచ్చాయి.  

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు