Breaking News

మండుతున్న ఎండలు

Published on Wed, 07/02/2025 - 11:04

పారిస్‌: భానుడి భగభగలతో యూరప్‌ ప్రజ­లు తల్లడిల్లుతున్నారు. అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. మొట్టమొదటి వడగాడ్పుల తీవ్రతకు పలు చోట్ల కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తూ నివాస ప్రాంతాలను దహించి వేస్తోంది. ప్రభుత్వాలు ప్రజలకు వేడి నుంచి ఉపశమనం కలిగించే చర్యలను అమలు చేస్తున్నాయి. స్పెయిన్‌ రాజ«­దాని బార్సిలోనాలో ఎండల తీవ్రత వందేళ్ల రికార్డును చెరిపేసింది. 1914లో ఈ నగరంలో జూన్‌లో నమోదైన సరాసరి ఉష్ణోగ్రత 26 డిగ్రీలు. తాజాగా, జూన్‌ 30న 37.9 డిగ్రీ­లతో ఈ రికార్డు బద్దలైంది. 

కొండప్రాంతం, మధ్యదరా సముద్రం మధ్యలో ఉండే బార్సిలోనాలో సాధారణంగా అంతగా ఎండలుండ­వు. ఈ సీజన్‌లో ఈ పరిస్థితి తలకిందులైంది. స్పెయిన్‌లోని మిగతా ప్రాంతాల్లో సైతం ఎండలు మండిపోతున్నాయి. ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్‌లోనూ ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. పారిస్‌లో మంగళవారం 40 డిగ్రీ­ల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం సు­మా­రు 1,300 స్కూళ్లను మూసివేశారు. పారిస్‌లోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ఈఫిల్‌ టవర్‌ను గురువారం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇటలీలోని 27 ప్రధాన నగరాలకు గాను 17 చోట్ల వడగాడ్పు­లు వీస్తున్నాయి. 

వడగాడ్పులతో ఇద్దరు వ్యక్తు­లు చనిపోయారు. యూకేలోని కెంట్‌లో అత్యధికంగా 33.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అత్యధికంగా 35 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదేసమయంలో తుర్కియేలో మొదలైన కార్చిచ్చు నివాసప్రాంతాల్లోకి వేగంగా వ్యాపిస్తోంది. ప్రభుత్వం బిలెసిక్, హటాయ్, జ్మిర్‌ నగరాల నుంచి ముందు జాగ్రత్తగా 50 వేల మందిని ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 

కొన్ని ప్రాంతాల్లో మంటలను అదుపులోకి తెచి్చనప్పటికీ విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు పనిచేయడం లేదు. గ్రీస్‌లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. వీటికి తోడు కార్చిచ్చు ప్రమాదం పొంచి ఉందని అధికారులు చియోస్, సమోస్, ఇకారియా, కితిరా, లకోనియా అట్టికా తదితర ప్రాంతా­ల్లో ప్రమాదహెచ్చరికలు జారీ చేశారు. 

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు