Breaking News

అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన తెలుగోడు

Published on Mon, 05/20/2024 - 04:09

వాషింగ్టన్‌: తెలుగు బిడ్డ గోపీ తోటకూర చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తొలి భారత స్పేస్‌ టూరిస్టుగా ఘనత సాధించారు. అంతేకాదు, అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డుకెక్కారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్‌ కమాండర్‌ రాకేశ్‌ శర్మ మొట్టమొదటిసారి అంతరిక్ష ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సారథ్యంలోని బ్లూ ఆరిజిన్‌ ప్రైవేట్‌ సంస్థ ఔత్సాహికులను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. 

ఇందులో భాగంగా ఏడో హ్యూమన్‌ ఫ్లైట్‌ ‘ఎన్‌–25’ఆదివారం ఉదయం అమెరికాలోని వెస్ట్‌ టెక్సాస్‌ లాంచ్‌ సైట్‌ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. 10 నిమిషాలకుపైగా అంతరిక్షంలో విహరించి, క్షేమంగా వెనక్కి తిరిగివచ్చింది. ఈ రాకెట్‌లో ప్రయాణించిన ఆరుగురిలో గోపీ తోటకూర కూడా ఉన్నారు. భూవాతావరణం, ఔటర్‌స్పేస్‌ సరిహద్దు రేఖ అయిన కర్మాన్‌ లైన్‌ పైభాగం వరకు వీరి ప్రయాణం సాగింది. అంతరిక్షాన్ని తాకి వచ్చారు. భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలో కర్మాన్‌ లైన్‌ ఉంటుంది. 

బ్లూ ఆరిజిన్‌ సంస్థ ద్వారా ఇప్పటిదాకా 31 మంది స్పేస్‌ టూరిస్టులు అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన గోపీ తోటకూర ఎంబ్రీ–రిడిల్‌ ఏరోనాటికల్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. పైలట్‌గా శిక్షణ పొందారు. ప్రిజర్వ్‌ లైఫ్‌ కార్పొరేషన్‌ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడు. ఇంటర్నేషనల్‌ మెడికల్‌ జెట్‌ పైలట్‌గా పని చేస్తున్నారు. గోపీకి సాహసాలంటే ఇష్టం. ఇటీవలే టాంజానియాలోని అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్‌ కిలిమంజారోను అధిరోహించారు.  

60 ఏళ్ల తర్వాత.. నెరవేరిన కల  
అమెరికాకు చెందిన మొట్టమొదటి నల్లజాతి వ్యోమగామి, ఎయిర్‌ఫోర్స్‌ మాజీ కెపె్టన్‌ ఎడ్‌డ్వైట్‌ కల ఎట్టకేలకు నెరవేరింది. ఆయన వయసు 90 ఏళ్లు. ఈ వయసులో అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా పూర్తిచేశారు. ఆదివారం బ్లూ ఆరిజిన్‌ ‘ఎన్‌–25’మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. 1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ ‘నాసా’అంతరిక్ష ప్రయాణాల కోసం ఎడ్‌డ్వైట్‌ను కూడా ఎంపిక చేశారు. కానీ, ఆయనకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం అప్పట్లో లభించలేదు. 60 ఏళ్ల తర్వాత కల నెరవేర్చుకున్నారు.    

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)