amp pages | Sakshi

విచారణ కమిటీ ముందుకు టెక్‌ దిగ్గజాలు

Published on Wed, 07/29/2020 - 09:50

శాన్‌ఫ్రాన్సిస్కో : టెక్నాలజీ ప్రాబల్యంతో ఆన్‌లైన్‌ వేదికల ద్వారా విద్వేషం, హింస పెరిగిపోతున్నదనే ఆరోపణల నేపథ్యంలో అమెరికన్‌ సెనేట్‌లో బుధవారం జరిగే విచారణ సందర్బంగా టెక్‌ దిగ్గజాలు విచారణ కమిటీ ఎదుట హాజరుకానున్నారు. సాంకేతిక దిగ్గజాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో వారు నిర్మంచిన దిగ్గజ సంస్థలు అమెరికన్‌ చట్టాలకు అనుగుణంగా ఎదిగిన తీరును వారు సమర్ధించుకోనున్నారు. ఫేస్‌బుక్ చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌, యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌, గూగుల్‌ దాని మాతృసంస్థ అల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌లు విచారణకు హాజరుకానున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాలుగు దిగ్గజ టెక్నాలజీ సంస్థల సీఈఓలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణలో పాల్గొంటారు.

చదవండి : ఎఫ్‌బీ బ్యాన్‌: కోర్టును ఆశ్రయించిన అధికారి

సభా కమిటీ విచారణ ప్రారంభమవనున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌ చీఫ్‌ జుకర్‌బర్గ్‌ మాట్లాడుతూ అమెరికన్‌ కంపెనీగా ఫేస్‌బుక్‌ ఎదిగిన తీరు గర్వకారణమని అంటూ పోటీతత్వాన్ని ప్రేరేపించే అమెరికన్‌ చట్టాల ఆసరాతో తమ కంపెనీ ఎదిగిందని చెప్పుకొచ్చారు. హానికారక కంటెంట్‌, గోప్యత, ఎన్నికల సమగ్రత వంటి కీలక అంశాలపై కంపెనీలు ఇష్టానుసారం తీర్పులు ఇవ్వరాదన్నది తన అభిమతమని జుకర్‌బర్గ్‌ పేర్కొనడం గమనార్హం. ఇక ఇంటర్‌నెట్‌ నిబంధనలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఇంటర్‌నెట్‌ నిబంధనల మార్పును అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ నొక్కిచెప్పనున్నారు. అమెరికా విజయ ప్రస్ధానంగా అమెజాన్‌ను ఆయన అభివర్ణిస్తూ అమెజాన్‌లోనూ నిబంధనల పరిశీలన అవసరమని తాను నమ్ముతానని విచారణకు ముందు బెజోస్‌ ఆన్‌లైన్‌లో వ్యాఖ్యానించారు. జెఫ్‌ బెజోస్‌ కాంగ్రెస్‌ ఎదుట విచారణకు హాజరవడం  ఇదే తొలిసారి. 


ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
సమాచార గోప్యత నుంచి డేటా దుర్వినియోగం వరకూ విచారణ సందర్బంగా జ్యుడిషియరీ కమిటీ సాంకేతిక దిగ్గజాలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయవచ్చని భావిస్తున్నారు. మార్కెట్‌ప్లేస్‌లో తమ అధికారాలను వీరు దుర్వినియోగం చేస్తున్నారా అనే కోణంలోనూ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ప్రస్తుత అమెరికా యాంటీట్రస్ట్‌ చట్టాలను మార్చడంపైనా వారి అభిప్రాయాలు కోరనున్నారు. ఇక హింసను ప్రేరేపించే విద్వేష కంటెంట్‌ను కట్టడి చేయడంలో ఫేస్‌బుక్‌ విఫలమైందనే ఆరోపణల నడుమ ప్రతినిధుల కమిటీ ఎదుట టెక్‌ దిగ్గజాల విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.

Videos

బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి

తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం

కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్

వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల

రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్

ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ

అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు

Photos

+5

ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)

+5

Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు)

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)