Breaking News

టాంజానియా అధ్యక్షురాలిగా సమియా హసన్‌ ఎన్నిక

Published on Sun, 11/02/2025 - 06:45

కంపాలా(ఉగాండా): టాంజానియా అధ్యక్షురాలు సమియా సులుహు హస్సన్‌ అపూర్వ విజయం సాధించారు. పోలైన ఓట్లలో ఆమెకు 97 శాతానికి పైగా ఓట్లు పడ్డాయని శనివారం అధికారులు ప్రకటించారు. ఎన్నికలు వివాదాస్పదంగా మారిన వేళ అధికారులు ఈ ప్రకటన చేయడం గమనార్హం. దేశ పరిపాలనా రాజధాని డొహొమాలో జరిగిన కార్యక్రమంలో అధికారులు ఆమెను ఎన్నికల్లో విజేతగా ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్‌ అందజేశారు. 

ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలను పోటీలో లేకుండా చేయడం, చిన్న పార్టీలకు చెందిన 16 మంది అభ్యర్థులను హస్సన్‌ ఎదుర్కోవడం తదితర అంశాల్లో ఈ ఎన్నికలపై దేశీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. అక్టోబర్‌ 29వ తేదీన ఎన్నికల సమయంలో పెద్ద సంఖ్యలో జనం వీధుల్లోకి రావడంతోపాటు పోలింగ్‌ ప్రక్రియను అడ్డుకునేందుకు యత్నించారు. అడ్డుకోబోయిన పోలీసులు, మిలటరీతో తలపడ్డారు. ఈ ఘర్షణల్లో కనీసం 10 మంది చనిపోయినట్లు ఐరాస మానవ హక్కుల విభాగం ప్రకటించింది. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన జాన్‌ పొంబె ముగుఫులి కొద్దిరోజులకే అనారోగ్యంతో చనిపోవడంతో, ఉపాధ్యక్షురాలిగా ఉన్న హస్సన్‌ 2021లో అధ్యక్షురాలయిన సంగతి తెలిసిందే.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)