Breaking News

ఇరాన్ దాడితో హర్మూజ్‌ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు!

Published on Fri, 11/14/2025 - 20:14

తెహ్రాన్‌: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలను అంతర్జాతీయ వాణిజ్యంతో అనుసంధానించే హర్మూజ్‌ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శుక్రవారం ఉదయం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ నేవీ బలగాలు తలారా అనే ఆయిల్ ట్యాంకర్‌ను ఆక్రమించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

ఈ నౌక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అజ్మాన్ పోర్ట్ నుంచి బయలుదేరి సింగపూర్ వైపు ప్రయాణిస్తోంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, ఈ నౌకను ఇరాన్ తీర ప్రాంతానికి బలవంతంగా మళ్లించారు. అమెరికా నౌకాదళం ఈ ఘటనను ధృవీకరించింది. సమాచారం ప్రకారం, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ బలగాలు హెలికాప్టర్ ద్వారా నౌకపై దాడి చేసి ఆక్రమించారు. ఖోర్ ఫక్కాన్ తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో, మూడు చిన్న పడవలతో బెదిరించి నౌకను ఇరాన్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.

ఈ చర్య ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చోటుచేసుకుంది. ఇటీవల ఇరాన్‌పై జరిగిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. అమెరికా మరియు బ్రిటన్ ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. మధ్యప్రాచ్యంలో నౌకాశ్రయ భద్రతపై ఇది మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా పరిగణించే హర్మూజ్‌ జలసంధి అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం, ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి. ఇందులో ఓ చోట కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ మార్గం ద్వారా నిత్యం 2 కోట్ల బారెళ్ల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. ప్రపంచ క్రూడ్ ఆయిల్ సరఫరాలో సుమారు 20% ఈ మార్గం ద్వారా సాగుతుంది. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి ఆక్రమణలు అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముంది.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)