Breaking News

సిరియాలో దారుణం.. 30 మంది మృతి

Published on Mon, 06/23/2025 - 07:25

డమాస్కస్‌: సిరియా రాజధాని డమాస్కస్‌ శివారులోని ఓ చర్చిలో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. డ్వెయిల్‌ ప్రాంతంలోని మార్‌ ఎలియాస్‌ చర్చిలో పెద్ద సంఖ్యలో జనం ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడని మీడియా తెలిపింది. కనీసం 30 మంది చనిపోగా మరో 53 మంది గాయపడ్డారని సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ సంస్థ తెలిపింది. బాధితుల్లో పలువురు చిన్నారులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది.

చర్చిలో జనం మధ్యకు చేరుకున్న ఓ వ్యక్తి ముందుగా తుపాకీతో కాల్పులు జరిపి, అనంతరం పేల్చేసుకున్నట్లు ఓ వీడియో వైరలవుతోంది. కాగా, మృతులు, క్షతగాత్రుల కచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది. చర్చిల్లో దాడులు జరగడం సిరియాలో ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సిరియాలో బషర్‌ అస్సద్‌ పాలన అంతమయ్యాక పగ్గాలు చేపట్టిన అహ్మద్‌ అల్‌ షరా యంత్రాంగంపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న క్రమంలో ఘటన చోటుచేసుకుంది.  

ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన ఓ ఉగ్రవాది తొలుత చర్చిలో ప్రవేశించి తుపాకీతో కాల్పులు జరిపాడని, అనంతరం తనను తాను పేల్చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ సిరియా అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ దాడిని సిరియా సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి హమ్జా మొస్తాఫా ఖండించారు. దీనిని పిరికిపంద దాడిగా అభివర్ణించారు. దుండగుడు తొలుత చర్చిలో గ్రెనేడ్‌ విసిరేసినట్లు చర్చి బిషప్‌ తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని తాను చూశానని, అతనివెంట మరో ఇద్దరు సైతం వచ్చారని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దుండగుడు తొలుత కాల్పులు ప్రారంభించి, అనంతరం చర్చిలోకి దూసుకెళ్లి తనను తాను పేల్చివేసుకున్నట్లు పేర్కొన్నాడు. 

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)