Breaking News

రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ వద్దు.. మాకు బోరిస్‌ కావాలి!

Published on Mon, 08/22/2022 - 10:20

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని రేసు దగ్గర పడుతున్న వేళ.. కన్జర్వేటివ్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో దూసుకుపోయిన ప్రధాని అభ్యర్థి రిషి సునాక్‌.. ఆ తర్వాత అనూహ్యంగా వెనుక పడిపోయారు. ఇప్పటికే లిజ్ ట్రస్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో.. 

ప్రధాని రేసులో తెరపైకి మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేరు వచ్చింది. జాన్సన్‌ను PM రేసు నుండి తొలగించబడకూడదంటూ స్వింగ్ ఓటర్లు పట్టుబడుతున్నారు. అంతేకాదు.. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు లిజ్ ట్రస్‌, రిషి సునాక్‌లపై తక్కువ నమ్మకాన్ని ఓటర్లు ప్రదర్శించారు. టోరీ సపోర్టర్స్‌(కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు)లో 49 శాతం మంది ఇప్పటికీ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌పైనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని ప్రధాని రేసు నుంచి తప్పించొద్దని, లిజ్‌ ట్రస్‌, రిషి సునాక్‌ల కంటే ఆయన మీదే తమకు నమ్మకం ఉన్నట్లు వెల్లడించారు. 

జాన్సన్‌ను తొలగించడం ద్వారా పార్టీ, ఎంపీల ప్రతిష్ట దెబ్బతిందని తాము నమ్ముతున్నామని పలు ఇంటర్వ్యూలలో అట్టడుగు నియోజకవర్గాల ఓటర్లు చెప్తుండడం విశేషం. ‘‘ఆయనలా(బోరిస్‌) ఇతరులు వ్యవహరిస్తారనే నమ్మకం మాకు లేదు. ఎందుకంటే.. బ్రెగ్జిట్‌ సమయంలో, కరోనా వైరస్‌ కట్టడి సమయంలో, చివరకు ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలోనూ తలెత్తిన పరిస్థితులను ఆయన చాలా బాగా హ్యాండిల్‌ చేశారు. చిన్న చిన్న కారణాలతోనే ఆయన ప్రధాని పదవి నుంచి తప్పించారు. ఆయనలా వీళ్లు పాలిస్తారని అనుకోవడం లేదు. ఆయనకు మరో అవకాశం ఇవ్వడం మంచిది’’ అని చాలామంది ఓటర్లు తమ అభిప్రాయం వెల్లడించారు. 

లిజ్ ట్రస్ మరియు రిషి సునక్‌ల మద్దతు కంటే మిస్టర్ జాన్సన్ ప్రధానమంత్రిగా కొనసాగాలని 49 శాతం మంది టోరీ మద్దతుదారులు భావించారని yougov చేసిన ప్రత్యేక జాతీయ పోలింగ్ ద్వారా వెల్లడైంది. పైగా 2024 ఎన్నికల సమయంలో ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ ఉంటేనే.. కన్జర్వేటివ్‌ పార్టీకి బాగా కలిసొస్తుందని వాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సర్వేను కన్జర్వేటివ్‌ పార్టీ పరిగణనలోకి తీసుకుంటాదా? అనేది కచ్చితంగా చెప్పలేం. మరోవైపు బ్రిటన్‌ ప్రధాని రేసులో తుది జాబితాలో ఉన్న రిషి సునాక్‌, విదేశాంగ కార్యదర్శి లిజ్‌ టస్‌లు.. తమ తమ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు.

ఇదీ చదవండి: బ్రిటన్‌ ప్రధాని రేసు.. రిషి సునాక్‌ వినూత్న ప్రచారం!

Videos

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)