సృజనాత్మక ప్రగతికి ఆర్థిక నోబెల్‌ 

Published on Mon, 10/13/2025 - 15:09

స్టాక్‌హోమ్‌: ప్రపంచ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తూనే, అంతర్జాతీయంగా జీవన ప్రమాణాల మెరుగుకు దోహదపడే ‘సృజనాత్మక విధ్వంసం’ భావనను మరింత ప్రభావవంతంగా వివరించిన ముగ్గురు ఆర్థికవేత్తలకు 2025 ఏడాదికిగాను ఆర్థిక నోబెల్‌ పురస్కారం దక్కింది. సోమవారం నోబెల్‌ కమిటీ ఆర్థికవేత్తలు జోయెల్‌ మోకిర్, ఫిలిప్‌ అఘియన్, పీటర్‌ హోవిట్‌లకు 2025 ఏడాదికి ఎకనమిక్స్‌ నోబెల్‌ను ప్రకటించింది. ‘‘కొత్త ఉత్పత్తులు, తయారీ విధానాలకు కొత్త ఆవిష్కరణలు ఏ రకంగా దోహదపడతాయనేది ఈ ముగ్గురు వివరించారు. 

ఆర్థిక స్తబ్దత అనేది ఎప్పుడైనా జరగొచ్చు. దాని పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వీళ్లు సోదాహరణంగా హెచ్చరించారు’’ అని ఆర్థికశాస్త్ర నోబెల్‌ కమిటీ చైర్మన్‌ జాన్‌ హాస్లర్‌ కొనియాడారు. ముగ్గురికీ సంయుక్తంగా దాదాపు రూ.10.63 కోట్ల నగదు బహుమతి లభిస్తుంది. ఇందులో సగభాగాన్ని డచ్‌ ఆర్థికవేత్త మోకిర్‌ అందుకోనున్నారు. మిగతా సగాన్ని ఫిలిప్, పీటర్‌ పంచుకోనున్నారు. ముగ్గురికీ విడివిడిగా 18 క్యారెట్ల విలువైన బంగారు నోబెల్‌ మెడల్‌ను మెడలో వేయనున్నారు. కృత్రిమమేధతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతుందన్న అంచనాల మధ్య క్రియేటివ్‌ డిస్ట్రక్షన్‌ సిద్ధాంత విశ్లేషకులకు ఆర్థిక నోబెల్‌ దక్కడం విశేషం.  

ఏమిటీ పరిశోధన? 
‘‘పాత ఆవిష్కరణల స్థానాన్ని కొత్త ఆవిష్కరణలు భర్తీచేస్తున్నప్పుడు అవి ఎలా పనిచేస్తున్నాయి అనేది ఒక్కటి పరిశీలిస్తే సరిపోదు. అసలు ఆ కొత్త ఆవిష్కరణ ఏ రకంగా విజయం సాధిస్తుందనేది శాస్త్రీయంగా అర్థంచేసుకోగలగాలి. దీనిని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చక్కగా వివరించారు’’ అని నోబెల్‌ కమిటీ కొనియాడింది. ప్రత్యామ్నాయంగా కొత్త సాంకేతికతలు రావడంతో పాతవి కనుమరుగవుతాయి. ఒకరకంగా పాత ఆవిష్కరణలను మనుగడలో లేకుండా కొత్తవి నాశనంచేస్తాయి. 

ఈ ఆర్థిక భావనను ‘సృజనాత్మక విధ్వంసం’ అంటారు. ఈ భావనను అమెరికా, ఇజ్రాయెల్‌ మూలాలున్న నెదర్లాండ్స్‌ ఆర్థిక చరిత్రకారుడు జోయెల్‌ మోకిర్‌ తనదైన శైలిలో వివరించారు. ఇందుకోసం పాత ఆర్థికశాస్త్ర పుస్తకాలను తిరగేశారు. 79 ఏళ్ల మోకిర్‌ ప్రస్తుతం అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ వర్సిటీలో ఆర్థిక పరిశోధనలు చేస్తున్నారు. ఇదే భావనను ఫ్రాన్స్‌లో జని్మంచిన ఆర్థికవేత్త ఫిలిప్‌ అఘియన్, కెనడాలో జని్మంచిన ఆర్థికవేత్త పీటర్‌ విలి్కన్‌సన్‌ హోవిట్‌ సైతం గణిత సిద్ధాంతాలతో వివరించారు. 

69 ఏళ్ల అఘియన్‌ ప్రస్తుతం పారిస్‌లోని కాలేజ్‌ ది ఫ్రాన్స్‌లో, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 79 ఏళ్ల హోవిట్‌ ప్రస్తుతం అమెరికాలోని బ్రౌన్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ఆర్థికనోబెల్‌కు ఎంపికైన విషయం తెల్సి ఆర్థికవేత్త మోకిర్‌ షాక్‌కు గురయ్యారు. ‘‘ఏదైనా అనూహ్యమైనది సాధించినప్పుడు షాక్‌లో ఉన్నామని చాలా మంది చెబుతుంటారు. అది నిజంగా నిజం. నేనిప్పుడు అదే అనుభూతిని పొందా. నోబెల్‌ గెల్చుకుంటానని అస్సలు అనుకోలేదు. నిజానికి మీకు నోబెల్‌ రావొచ్చని నా విద్యార్థులు చెప్పారు. వాళ్లతో ఒక్కటే చెప్పా. వస్తే నాకు పోప్‌ పదవి రావొచ్చుగానీ నోబెల్‌ రాదని చెప్పా’’ అని మోకిర్‌ సరదాగా మాట్లాడారు. ‘‘ఈ వేసవికాలానికి నాకు 80 ఏళ్లు నిండుతాయి. అయినా నా వృత్తి నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకోను. ఆర్థికవేత్తగా జీవితాంతం కొనసాగాలన్నదే నా కల’’ అని ఆయన అన్నారు.  

నజరానాను పరిశోధనకు కేటాయిస్తా.. 
నోబెల్‌ గెల్చుకోవడంపై ఆర్థికవేత్త అఘియన్‌ స్పందించారు. ‘‘ఈ అనుభూతిని వరి్ణంచడానికి నాకు మాటలు రావట్లేదు. ప్రైజ్‌మనీగా నాకు దక్కే నగదును మళ్లీ ఆర్థికశాస్త్ర పరిశోధనల కోసమే ఖర్చుచేస్తా. అమెరికాలో ట్రంప్‌ సర్కార్‌ విదేశీ మేధావులను రానీయకుండా అడ్డుకుంటోంది. ట్రంప్‌ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, రక్షణాత్మకత ధోరణి చాలా తప్పు. ఇది ప్రపంచ ఆర్థిక ప్రగతికి, ఆవిష్కరణలకు విఘాతంగా మారనుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.  

 

 ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

ఈ భావన ఎప్పటిది? 
క్రియేటివ్‌ డిస్ట్రక్షన్‌ అనేది దశాబ్దాలనాటి పాత సిద్ధాంతం. ఈ భావనను ఆర్థికవేత్త జోసెఫ్‌ షుమ్‌పీటర్‌ ప్రతిపాదించారు. ఆయన 1942లో రచించిన తన ‘పెట్టుబడిదారీవిధానం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం’ పుస్తకంలో ఈ సిద్ధాంతాన్ని తొలిసారిగా పేర్కొన్నారు. ఈ సృజనాత్మక విధ్వంసం భావనను తమదైన రీతిలో వివరించేందుకు అఘియన్, హోవిట్‌లు 1992లో ఒక గణితశాస్త్ర మోడల్‌ను అభివృద్ధిచేశారు. అఘియన్‌ 2017లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ఆర్థిక పథకానికి సైతం తుదిరూపుని చ్చారు. కృత్రిమమేధ రంగంలో ఫ్రాన్స్‌లో అగ్రగామిగా మార్చాలంటే ఏ రకమైన విధానాలను అవలంభించాలో తెలుపుతూ 25 ప్రతిపాదనలను మేక్రాన్‌కు అఘియన్‌ అందజేశారు. ‘‘ఆర్థిక ప్రగతిని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించకూడదు. అది ఎందుకు సాధ్యమైందో అర్థంచేసుకుని ముందుకు సాగాలి. లేదంటే సంక్షోభంలో చిక్కుకుపోతాం’’ అని జాన్‌ హాస్లర్‌ వ్యాఖ్యానించారు.  

 

 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)