Breaking News

సునీత,విల్మోర్‌లకు ‘గ్రావిటీ’ భయం..!

Published on Sat, 02/15/2025 - 16:12

వాషిం‍గ్టన్‌: నాసా  వ్యోమగాములు సునీతా విలియమ్స్‌,బుచ్‌ విల్మోర్‌లు అంతరిక్షం నుంచి మార్చి 19న భూమి మీదకు బయలుదేరనున్నారు. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ స్పేస్‌స్టేషన్‌(ఐఎస్‌ఎస్‌)కు వెళ్లిన వారిద్దరు అనుకోని పరిస్థితుల్లో ఎనిమిది నెలలపాటు అక్కడే ఉండిపోయారు. అయితే వ్యోమగాములిద్దరు భూమి మీదకు వచ్చిన తర్వాత పలు రకాల సమస్యలను ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది. 

జీరో గ్రావిటీ నుంచి భారీ గురుత్వాకర్షణ  కలిగిన భూమి వాతావరణంలోకి 8 నెలల తర్వాత వారు రానుండడమే ఇందుకు కారణం. తాము భూమి మీదకు వచ్చిన తర్వాత చిన్న పెన్సిల్‌ను లేపినా పెద్ద బరువులు ఎత్తి వ్యాయామం చేసిన ఫీలింగే ఉంటుందని విల్మోర్‌ మీడియాకు తెలిపారు.‘ఇక్కడి నుంచి భూమి మీదకు వచ్చిన తర్వాత గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. భూమిపై పరిస్థితులకు అలవాటుపడే దాకా ఇబ్బందిగానే ఉంటుంది.

శరీరం బరువెక్కిన ఫీలింగ్‌ కలుగుతుంది’ అని విల్మోర్ వెల్లడించారు. స్పేస్‌లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు..భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ ప్రత్యేక అనుభూతికి దూరమవుతారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది.ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లాక వారి శరీరం ఎర్రరక్తకణాలను నాశనం చేయడం ప్రారంభిస్తుంది.

ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గించుకోవడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్‌ అవసరాలను తగ్గించుకుంటుంది.గుండె పనితీరుపైనా అంతరిక్షం ప్రభావం చూపిస్తుంది.బోయింగ్‌ వ్యోమనౌకలో భాగంగా నాసా గత జూన్‌లో సునీత,విల్మోర్‌లను ఐఎస్‌ఎస్‌కు పంపించింది. వ్యోమనౌకలో లోపాలు తలెత్తడంతో వారం రోజుల కోసం వెళ్లిన ఇద్దరు ఏకంగా 8 నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)