Breaking News

ఐఎస్‌ఎస్‌లోకి స్వాగతం

Published on Mon, 03/17/2025 - 04:49

కేప్‌ కనావెరాల్‌: తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ను భూమికి తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్, నాసా సంయుక్తంగా ప్రయోగించిన క్రూ క్యాప్సూల్‌ ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది. అందులో వెళ్లిన నలుగురు వ్యోమగాములు అన్నె మెక్‌క్లెయిన్, నికోల్‌ అయేర్స్‌ (అమెరికా), తుకుయా ఒనిషీ (జపాన్‌), కిరిల్‌ పెస్కోవ్‌ (రష్యా) ఆదివారం ఉదయం ఐఎస్‌ఎస్‌లో అడుగు పెట్టారు.

వారికి సునీత, విల్మోర్‌ సాదర స్వాగతం పలికారు.  స్పేస్‌స్టేషన్‌ హ్యాచ్‌ను తెరచిన విల్మోర్‌ వ్యోమనౌక గంటను మోగించి వారిని స్వాగతించారు. వారింతా పరస్పరం హత్తుకుని, కరచాలనం చేసుకుని హర్షాతిరేకాలు చేశారు. ‘‘ఇది అద్భుతమైన రోజు. స్నేహితుల రాక మాకెంతో ఆనందాన్నిచ్చింది’’ అని మిషన్‌ కంట్రోల్‌తో విల్మోర్‌ చెప్పుకొచ్చారు. ఐఎస్‌ఎస్‌లో నిర్వర్తించాల్సిన విధులను వారికి సునీత, విల్మోర్‌ కొద్ది రోజుల పాటు విడమర్చనున్నారు.

అనంతరం వాళ్లు బాధ్యతలు స్వీకరిస్తారు. వారం తర్వాత సునీత, విల్మోర్‌ క్రూ క్యాప్సూల్‌లో భూమికి తిరిగొస్తారు. వారితో క్యాప్సూల్‌ ఫ్లోరిడా తీర సమీపంలో సముద్ర జలాల్లో దిగనుంది. అప్పటిదాకా ఐఎస్‌ఎస్‌లో 11 మంది వ్యోమ గాములు సేవలందించనున్నారు. బోయింగ్‌ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా గత ఏడాది జూన్‌లో సునీత, విల్మోర్‌ ఐఎస్‌ఎస్‌కు వెళ్లడం తెల్సిందే. వారు ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా స్టార్‌లైనర్‌ సాంకేతిక సమస్యలతో ఆలస్యమైంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)