Breaking News

అంతరిక్షం నుంచే ఓటు వేస్తా: సునీతా విలియమ్స్‌

Published on Sat, 09/14/2024 - 08:50

ఫ్లోరిడా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచే ఓటు వేస్తామని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతావిలియమ్స్‌,బుచ్‌విల్‌మోర్‌తెలిపారు. అంతరిక్షంనుంచిసునీత,విల్‌మోర్‌ శుక్రవారం(సెప్టెంబర్‌13)మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ‘పౌరులుగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యం. అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నా. ఐఎస్‌ఎస్‌లో ఉండి నా కుటుంబాన్ని, నా రెండు కుక్కలను చాలా మిస్సవుతున్నా.నాకే కాదు ఇది నా కుటుంబ సభ్యులకు కఠినమైన సమయం. అయితే పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారు’అని సునీత అన్నారు.

మరో వ్యోమగామి విల్మోర్‌ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను తన బ్యాలెట్‌ రిక్వెస్ట్‌ పంపినట్లు చెప్పారు.జూన్‌5న బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత, విల్‌మోర్‌లు సాంకేతిక కారణాల వల్ల షెడ్యూల్‌ ప్రకారం భూమికి తిరిగి రాలేకపోయారు.వీరిని తీసుకెళ్లిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ మాత్రం సెప్టెంబర్‌ 6న భూమిపై దిగింది. ఇద్దరు వ్యోమగాములను స్పేస్‌ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్‌ 2025 ఫిబ్రవరిలో భూమికి తీసుకువస్తుందని నాసా వర్గాలు చెబుతున్నాయి.

ఆబ్సెంటీ ఓటింగ్‌ విధానంలో.. 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ప్రత్యక్షంగా ఓటు వేయలేని వారి కోసం ఆబ్సెంటీ ఓటింగ్‌తో పాటు ఓట్‌  బై మెయిల్‌ విధానాలు అందుబాటులో ఉన్నాయి.వీటిలో ఆబ్సెంటీ ఓటింగ్‌ విధానంలో అర్హత కలిగిన ఓటర్లు బ్యాలెట్‌ రిక్వెస్ట్‌ పెట్టాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఓట్‌ బై మెయిల్‌ విధానం అందుబాటులో ఉంది. 

ఈ విధానంలో రిజిస్టర్‌ ఓటర్లందరికీ ఎన్నికల మందే మెయిల్‌ పంపుతారు. దీని ద్వారా పౌరులు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పోలింగ్‌ తేదీ కంటే ముందుగానే తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. 

ఇదీ చదవండి.. అంతరిక్షం నుంచి ఐక్య గీతం    

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)