Breaking News

సునీత రాక ఫిబ్రవరిలోనే!

Published on Sun, 08/25/2024 - 08:43

కేప్‌కనావెరాల్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ భూమికి తిరిగి రావడానికి బోయింగ్‌ స్టార్‌లైనర్‌ క్యాప్యూల్‌ సురక్షితం కాదని నాసా తేల్చిచెప్పింది. వారిని అందులో వెనక్కు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమని శనివారం పేర్కొంది. ఆ రిస్క్‌ తీసుకోరాదని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్‌ మస్‌్కకు చెందిన స్పేస్‌ ఎక్స్‌ షటిల్‌ డ్రాగన్‌ క్యాప్సూల్‌లో వారిని తీసుకురావాలని నిర్ణయించింది.

పలు వైఫల్యాల తర్వాత బోయింగ్‌ స్టార్‌లైనర్‌ గత జూన్‌లో సునీత, విల్మోర్‌లను అంతరిక్ష కేంద్రానికి చేర్చడం తెలిసిందే. థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీకేజీ తదితర సమస్యల నడుమ అతికష్టమ్మీద∙స్టార్‌లైనర్‌ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమైంది. వారం కోసమని వెళ్లిన సునీత, విల్మోర్‌ అక్కడే చిక్కుకుపోయారు. ఫిబ్రవరిలో తిరుగు ప్రమాణమంటే ఎనిమిది నెలలకు పైగా ఐఎస్‌ఎస్‌లోనే గడపనున్నారు. స్టార్‌లైనర్‌కు మరమ్మతులు చేయడానికి బోయింగ్‌ ఇంజనీర్లతో కలిసి నాసా తీవ్రంగా శ్రమించింది. మూడునెలల ప్రయత్నాల అనంతరం.. మానవసహిత తిరుగు ప్రమాణానికి స్టార్‌లైనర్‌ సురక్షితం కాదని తేల్చేసింది. అది ఒకటి, రెండు వారాల్లో ఐఎస్‌ఎస్‌ నుంచి విడివడి ఆటోపైలెట్‌ మోడ్‌లో ఖాళీగా భూమికి తిరిగి రానుంది. తమ విమానాల భద్రతపై ఇప్పటికే ఇబ్బందులను ఎదుర్కొంటున్న బోయింగ్‌కు స్టార్‌లైనర్‌ వైఫల్యం గట్టి ఎదురుదెబ్బే.

స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సూల్‌ ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలోనే ఉంది. మార్చి నుంచి ఐఎస్‌ఎస్‌లో ఉన్న నలుగురు వ్యోమగాములను తీసుకుని సెపె్టంబరు నెలాఖరులో భూమికి తిరిగివస్తుంది. అత్యవసరమైతే తప్ప అందులో మరో ఇద్దరిని ఇరికించడం సురక్షితం కాదని నాసా తెలిపింది. రష్యాకు చెందిన సోయుజ్‌ క్యాప్సూల్‌ కూడా ఐఎస్‌ఎస్‌లోనే ఉన్నా అందులోనూ ముగ్గురికే చోటుంది. ఏడాదిగా ఐఎస్‌ఎస్‌లో ఉన్న ఇద్దరు రష్యా వ్యోమగాములు అందులో తిరిగొస్తారు. డ్రాగన్‌ సెపె్టంబరులో ఇద్దరు వ్యోమగాములతో ఐఎస్‌ఎఐస్‌కు వెళ్తుంది. తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్‌లను కూడా తీసుకొస్తుంది. 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)