Breaking News

స్టార్‌ లైనర్‌లోనే సురక్షితంగా తిరిగొస్తాం

Published on Thu, 07/11/2024 - 05:45

కేప్‌కనవెరాల్‌: బోయింగ్‌ అంతరిక్ష నౌక ‘స్టార్‌ లైనర్‌’లో పలు సమస్యలు తలెత్తినప్పటికీ.. తాము అందులోనే భూమికి సురక్షితంగా తిరిగి వస్తామనే విశ్వాసం ఉందని  అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌)లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌లు బుధవారం తెలిపారు. స్టార్‌ లైనర్‌ తొలి మానవసహిత రోదసీ యాత్రలో జూన్‌ 5న సునీత, విల్మోర్‌లు అంతరిక్షంలోకి వెళ్లారు. 

హీలియం వాయువు లీక్‌ కావడం, థ్రస్టర్ల వైఫల్యం కారణంగా అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌తో అతికష్టం మీద అనుసంధానం కాగలిగారు. ఎనిమిది రోజుల అనంతరం భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ రాకెట్‌లో సమస్యల వల్ల ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుబడిపోయారు. ఐఎస్‌ఎస్‌ నుంచి బుధవారం వీరిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. థ్రస్టర్‌ను పరీక్షించడం పూర్తయ్యాక తిరుగు ప్రయాణమవుతామన్నారు. రోదసీలో ఎక్కువ సమయం ఉండాల్సి రావడం పట్ల తమకేమీ ఫిర్యాదులు లేవని, ఐఎస్‌ఎస్‌లోని ఇతర వ్యోమగాములకు సహాయపడటాన్ని ఆస్వాదిస్తున్నామని తెలిపారు. ‘స్టార్‌ లైనర్‌ మమ్మల్ని భూమికి చేర్చుతుందని నా మనసు చెబుతోంది. సమస్యేమీ లేదు’ అని సునీతా విలియమ్స్‌ విలేకరులతో అన్నారు.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)