Breaking News

సూడాన్‌లో నరమేధం 

Published on Fri, 10/31/2025 - 01:29

ఖార్టుమ్‌: సూడాన్‌లోని ఉత్తర దార్ఫుర్‌ ప్రాంతంలో ఉన్న ఎల్‌–ఫషేర్‌ నగరంలో ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌) మూకలు రక్తపు టేరులు పారిస్తున్నాయి. నగరంలోకి ఆదివారం ప్రవేశించిన ఈ బలగాలు వేలాది మంది పౌరులను నిర్బంధంలోకి తీసుకున్నాయి. వారిలో కనీసం 1,500 మందిని చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నగరంలోని సౌదీ ఆస్పత్రిని దిగ్బంధించి, మరో 460 మందిని బలి తీసుకున్నట్లు సమాచారం.

 భయకంపితులైన జనం ప్రాణాలరచేత బట్టుకుని పలాయనమవుతున్నారు. వారిని కూడా ఆర్‌ఎస్‌ఎఫ్‌ మూకలు వదలడం లేదు. చిత్రహింసల పాల్జేజి, చంపేస్తున్నారు. ఎలాగోలా తప్పించుకుని కాలి నడకన కనీసం 36 వేల మంది జనం అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలోని టవిలా పట్టణానికి చేరుకున్నట్లు సమాచారం. 48 గంటల వ్యవధిలోనే 15 వేల మంది నగరం వీడినట్లు అంచనా. 

ఇప్పటికే అక్కడ గూడుకోల్పోయిన వారు 6.50 లక్షలమంది ఉన్నట్లు అంచనా. ఖననం చేసే వారు లేకపోవడంతో ఎల్‌–ఫషెర్‌ నగరంలో ఎక్కడ చూసినా మృతదేహాలే పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. అక్కడ భయానక వాతావరణం నెలకొందన్నారు. కట్టుబట్టలతోనైనా తాము బయట పడటం అదృష్టమని చెప్పారు. 

ఆర్‌ఎస్‌ఎఫ్‌ సామూహిక జననానికి పాల్పడుతోందని సూడాన్‌ ఆర్మీ ఆరోపిస్తోంది. ఎల్‌–ఫòషేర్‌లో నరకానికి మించిన దారుణ పరిస్థితులున్నాయని ఐరాస మానవీయ విభాగం చీఫ్‌ టామ్‌ ఫ్లెచర్‌ వ్యాఖ్యానించారు. ఎల్‌–ఫòషేర్‌ నగరాన్ని ఏడాదిన్నర కాలంగా ఆర్‌ఎస్‌ఎఫ్‌ దిగ్బంధించింది. ఆహారం, ఇతర అత్యవసరాలు అందకుండా చేసింది. సూడాన్‌ ఆర్మీ నగరం నుంచి ఉపసంహరించుకోవడంతో రెచ్చిపోతోంది.  
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)