Breaking News

లెస్స పలికితివి మామా..

Published on Sat, 11/08/2025 - 09:43

హైలెస్స రికార్డు..
భారీ నౌక.. అందులో 130 మంది ప్రయాణికులు.. మొత్తంగా 1.18 లక్షల కిలోల బరువు. అయితే, కెనడాకు చెందిన వెస్లీ మూస్‌.. నౌకకు అలా తాడుకట్టి ఇలా ఒడ్డుకు(65 అడుగుల దూరం) లాక్కొచ్చేశాడు. తద్వారా అమెరికాలో జరిగిన స్ట్రాంగ్‌మన్‌ చాంపియన్స్‌ లీగ్‌ను గెలుచుకోవడంతోపాటు గిన్నిస్‌ బుక్‌లోకి కూడా ఎక్కాడు. ఇందుకోసం 81 సెకన్ల సమయం తీసుకున్నాడు. తన క్రేజీ కలలను నెరవేర్చుకోవడంలో తన భార్య ఎంతగానో సహకరించిందంటూ కృతజ్ఞతలు చెప్పాడు.  

గుండమ్మ కథ 
ఆయన రికార్డులను ఊదిపారేస్తే.. ఈవిడ ఎత్తిపారేస్తుంది. గుండ్లు ఎత్తడంలో ఈ గుండమ్మ ఫేమస్‌ అట. ఆస్ట్రేలియాకు చెందిన నికోల్‌ ఏకంగా 180 కిలోల గుండును ఎత్తడం ద్వారా అంతటి బరువున్న గుండును ఎత్తిన మహిళగా గిన్నిస్‌ రికార్డును సాధించింది. చిన్నప్పుడు అద్భుతాలు సాధించిన మనుషుల కథలను చదివి.. తానూ ఒక రోజు అలా అవ్వాలని నికోల్‌ కలలుగనే­దట. మనకీ అబ్దుల్‌ కలాం చెప్పారు. కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అని. మనం మొదటి సగం దగ్గరే ఆగిపోతున్నాం.. 
 మారుదామా మరి.. 

బబుల్‌ను చూస్తే.. గమ్‌నుండడు..
బబుల్‌ గమ్‌లను చూస్తే అమెరికాకు చెందిన చాడ్‌ ఫెల్‌ అస్సలు గమ్మునుండడు. వాటితో రికార్డులను ఊదిపారేస్తాడు. ఎంతలా అంటే ఆయన రికార్డును మరెవరూ బద్దలు కొట్టలేనంతగా.. ఇంతకీ ఆ గిన్నిస్‌ రికార్డు ఎందులోనో తెలుసా? అతిపెద్ద బబుల్‌ గమ్‌ బుడగను ఊది పేల్చడంలో.. ఈయన ఏకంగా 20 అంగుళాల బబుల్‌గమ్‌ బుడగను ఊది.. ఇదిగో ఇలా పేల్చే­శాడు. ఏదైతేనేం.. ఫెల్‌ రికార్డు సాధించి 20 ఏళ్లు దాటుతు­న్నా.. ఇప్పటివరకూ ఎవరూ దాన్ని బద్దలు కొట్టలేదట..  
మీరు ట్రై చేసి చూస్తారా?  
 

#

Tags : 1

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)