Breaking News

Indonesia: 6.2 తీవ్రతతో భూకంపం.. సునామీ ముప్పు?

Published on Wed, 11/05/2025 - 08:41

జకార్తా: ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో బుధవారం (నవంబర్ 5)  శక్తివంతమైన భూకంపం సంభవించింది. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దేశ జియోఫిజికల్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. ఈ భూకంపం తర్వాత సునామీ ప్రమాదం పొంచి ఉందని తొలుత భయపడినప్పటికీ, అటువంటిదేమీ లేదని ఏజెన్సీ నిర్ధారించింది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపింది.

సులవేసిలోని కొన్ని ప్రాంతాలను భూకంపం కుదిపేసింది. ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనలు తీవ్రంగా ఉండి, కొన్ని సెకన్ల పాటు కొనసాగాయి. పరిస్థితిని అంచనా వేయడానికి  అత్యవసర ప్రతిస్పందన బృందాలు ఉపక్రమించాయి. ఆసియా, ఆస్ట్రేలియన్ ఖండాల మధ్య, పసిఫిక్ మహాసముద్రం అంచున ఇండోనేషియా ఉంది. ఇది ప్రపంచంలోని 90 శాతం భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలలో 75 శాతం సంభవించే ప్రాంతంగా నిలిచింది. దేశ ప్రజలు తరచూ భూకంపాలు, సునామీల ప్రభావాలకు గురవుతుంటారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)