Breaking News

పద్ధతిగా వస్తేనే ప్రయాణం 

Published on Mon, 01/27/2025 - 06:31

వాషింగ్టన్‌: అర్థంపర్థం లేని టాటూలు, అసభ్యకర దుస్తులతో విమానంలో ప్రయాణిస్తామంటూ స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాల్లో ఇకపై కుదరదు. ఆ మేరకు తాజాగా సంస్థ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వివాదాస్పద కొటేషన్లున్న టీ షర్టులు ధరించినా ఒప్పుకోబోమని వెల్లడించింది. ఒక పద్ధతి ప్రకారం, హుందాతనం ఉట్టిపడేలా దుస్తులు ధరించాలని తేల్చి చెప్పింది. తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా వస్త్రధారణ ఉండాలని సూచించింది.

 ‘‘ ఇష్టమొచ్చిన దుస్తుల్లో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి మా స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎక్కుతామంటే కుదరదు. పద్ధతిగా బట్టలుండాలి. అందాల ఆరబోతకు అవకాశం ఇవ్వబోము. నిండుగా దుస్తులు ధరిస్తే మరీ మంచిది. చెప్పులు, షూ లేకుండా ఎలాంటి పాదరక్షలు ధరించకుండా వస్తామంటూ ఊరుకోం. ముఖ్యంగా అమ్మాయిల దుస్తులు మరీ పల్చగా, లోదుస్తులు కనిపించేంత పారదర్శకమైన డ్రెస్సింగ్‌లో వస్తే అస్సలు ఒప్పుకోం’’ అని స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ పలు నియమనిబంధనలను ప్రకటించింది.

 ‘‘ పిచ్చిపిచ్చి టాటూలు, రాతలు, కొటేషన్లు, వివాదాస్పద వస్తువులు ధరించి వచ్చినా విమానం లోపలికి అనుమతించబోం. కనీసం బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వం. ఇలా వచ్చినవారిని కుదిరితే ఎయిర్‌పోర్ట్‌ నుంచి కూడా వెనక్కి పంపేస్తాం’’ అని యాజమాన్యం స్పష్టంచేసింది. ఆధునికత పేరిట మరీ పొట్టిపొట్టి దుస్తులు ధరిస్తూ అమ్మాయిలు తోటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్న ఘటనలు తరచూ అమెరికా విమానాశ్రయాల్లో సంభవిస్తున్నాయి. 

వీటిని అరికట్టేందుకే ఇలాంటి నియామవళిని ఈ సంస్థ అమల్లోకి తెచ్చింది. గత అక్టోబర్‌లో తారా కెహెదీ అనే అమ్మాయి మరీ పొట్టిగా ఉన్న క్రాప్‌ టాప్‌ ధరించి రావడంతో అందరూ ఆ అమ్మాయి వంకే చూడటం మొదలెట్టారు. ఇది గమనించిన ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ఆమెను అడ్డుకోవడం, తదనంతరం నానా హంగామా జరగడం తెల్సిందే. 

2019లో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎక్కిన లాటిసా తిషా రోవే అనే అమ్మాయి అందాల ఆరబోత అతిగా ఉన్న స్ట్రాప్‌లెస్‌ రోంపర్‌ ధరించి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. దీంతో అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు ఆమెను దూషించడం, కొందరు యువకులు ఆమెను ఎగతాళిచేయడం తెల్సిందే. ఈ ఉదంతంలో చివరకు ఎయిర్‌లైన్స్‌ సంస్థే ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పింది. అమ్మాయి వస్త్రధారణకు చివరకు ఎయిర్‌లైన్స్‌ క్షమాపణ చెప్పిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు రాకూడదన్న ముందు జాగ్రత్తతో స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ ఇలా కఠిన నియమాలను అమల్లోకి తెచ్చింది.  
 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)