Breaking News

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. ఈ ఐదు ప్రధాన కారణాలు!

Published on Thu, 01/30/2025 - 19:54

ప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు ప్రయాణీకులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో విమానం ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఒకేరోజులో(జనవరి 29)న అమెరికా, సూడాన్‌లో జరిగిన విమాన ప్రమాదాల కారణంగా ఏకంగా 84 మంది ప్రాణాలు కోల్పోవడం బాధితుల కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేస్తో​ంది. ఈ ప్రమాదాలకు పైలట్స్‌, విమానంలో సాంకేతిక లోపాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రమాదాలకు మాత్రం ఐదు కారణాలే ముఖ్యంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

తాజాగా సౌత్‌ సూడాన్‌లో ఘోర విమాన భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20మంది ప్రయాణికులు మరణించారు. ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు ధృవీకరించారు. యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్‌ పయనీర్‌ ఆపరేటింగ్‌ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా ఉద్యోగుల్ని తీసుకుని రాజధాని జుబాకు బయలుదేరింది. అయితే, రన్‌వే నుండి 500 మీటర్ల దూరంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం కూలిపోయింది. ప్రయాణీకుల్లో 16 మంది సౌత్‌ సూడాన్‌, ఇద్దరు చైనా, ఒక భారతీయుడు ఉన్నట్లు తేలింది.

ఇక, భారత కాలమానం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున అమెరికాలోని వాషింగ్టన్‌ సమీపంలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్‌ ఢీ కొన్న ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 64 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అక్కడి అగ్నిమాపక శాఖ చీఫ్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు 28 మృతదేహాలను నదిలోంచి బయటకి తీసినట్లు తెలిపారు. అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, 2025 ఏడాది ప్రారంభంలోనే ఇలా ఒకే రోజున విమాన ప్రమాదాల కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడంతో ప్రయాణీకులు వణికిపోతున్నారు.

ఇదిలా ఉండగా.. 2000-2024 మధ్య 26 బోయింగ్‌ విమాన ప్రమాదాలు జరగ్గా అందుల్లో దాదాపు 10వేల మంది మరణించారు. ఒక్క 2024 ఏడాదిలో 15 విమాన ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదాల్లో 50 శాతం ప్రమాదాలకు ప్రధాన కారణంగా పైలట్లే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి పైలట్లు అనుభవిస్తున్న అలసటే కారణమని అంటున్నారు. ఇక, 20 శాతం ప్రమాదాలకు విమాన సాంకేతిక లోపాలే కారణమని అంటున్నారు. 2018 తర్వాత 2024లోనే విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి.

ఐదు కారణాలు ఇవే..

  • పైలట్ల లోపాలు.. 50 శాతం

  • సాంకేతిక లోపాలు.. 20 శాతం

  • పిడుగులు, తుఫాన్లు, బ్యాడ్‌ వెదర్‌.. 15 శాతం

  • టెర్రరిజం, మిస్సైల్‌ దాడులు.. 5 శాతం 

  • ఇతర ప్రమాదాలు.. 10 శాతం

దీనికి సంబంధించిన పలు కారణాలు విశ్లేషణతో ఈ వీడియోలో.. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)