Breaking News

టైమ్స్‌ స్క్వేర్‌ను చుట్టేసిన ‘చీర’ 

Published on Tue, 11/18/2025 - 06:27

‘సింగారమనే దారంతో చేసింది చీర 
ఆనందమనే రంగులనే అద్దింది చీర 
మమకారమనే మగ్గంపై నేసింది చీర  
చీరలోని గొప్పతనం తెలుసుకో..’ అంటూ చీరకున్న ప్రత్యేకతను వరి్ణంచారు కవులు. అలాంటి చీర సాధికారతను అమెరికాలో ప్రదర్శించారు మహిళలు. న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌లో ప్రత్యేక ‘చీర’కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూయార్క్‌కు చెందిన ఓ దాతృత్వ సంస్థ ఉమా గ్లోబల్, స్థానిక కాన్సులేట్‌ జనరల్‌ ఆప్‌ ఇండియా భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘చీర గోస్‌ గ్లోబల్‌’పేరుతో జరిగిన ఈ కార్యక్రమం రెండో ఎడిషన్‌. 

ఈ వేడుకలో భారత్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, మలేసియా, సింగపూర్, శ్రీలంక, అమెరికాలోని పలు నగరాల నుంచే కాకుండా న్యూయార్క్‌ మహిళలు కూడా పాల్గొన్నారు. విభిన్నమైన రంగులు, వివిధ రకాల చీరలతో టైమ్స్‌స్క్వేర్‌ కళకళలాడింది. కార్యక్రమంలో బిహు నృత్యం వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, చీర వాకథాన్‌ నిర్వహించారు. టైమ్స్‌ స్క్వేర్‌ చుట్టూ ఒక సింబాలిక్‌ మార్చ్‌ నిర్వహించారు. ‘వేల సంవత్సరాల చరిత్ర కలిగిన, ప్రపంచంలోని అత్యంత పురాతనమైన మహిళలు నిరంతరం ధరించే వ్రస్తాల్లో చీర ఒకటి. 

చీరకట్టే విధానం, రకరకాల శైలులు భారత్‌ వైవిధ్యాన్ని, కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి’న్యూయార్క్‌లోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలోని కాన్సుల్‌ ప్రజ్ఞాసింగ్‌ అన్నారు. చీర సాంస్కృతిక చరిత్ర, వైవిధ్యాన్ని ఆమె గుర్తు చేశారు. ఇది కేవలం సాంస్కృతిక వేడుక మాత్రమే కాదని, ఇండియాలోని చేతి వృత్తుల చరిత్రకు ప్రతీకని, మహిళలు నాయకత్వం వహిస్తే సమాజాలు అభివృద్ధి చెందుతాయని చీర మనకు గుర్తు చేస్తుందని న్యూయార్క్‌ నగర మేయర్‌ కార్యాలయంలో అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ కమిషనర్‌ దిలీప్‌ చౌహాన్‌ అన్నారు.  

న్యూయార్క్‌
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)